సుమ‌ని డీల్ చేయాలంటే ఏఎన్నార్ దిగాలి!

Update: 2021-08-25 07:30 GMT
సీనియ‌ర్ యాంక‌ర్ సుమ క‌న‌కాల వ్యాఖ్యాత‌గా ఎంత బిజీగా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ రంగంలో సుమ రెండున్న‌ర‌ దశాబ్ధాల‌ సుదీర్థ ప్ర‌స్థానం... వేడుక ఏదైనా వేదిక‌పై ఎవ‌రు ఉన్నా ఆ కార్య‌క్ర‌మాన్ని రంజింప‌జేయ‌డం సక్సెస్ చేయ‌డం త‌న‌కే చెల్లింది. త‌ప్పు జారినా మాట త‌డ‌బ‌డినా క‌వ‌ర్ చేయ‌డంలోనూ సుమ బ‌హునేర్ప‌రి. ఆ టెక్నిక్ వేరొక‌రికి తెలియ‌నే తెలీదు. అందుకే నేటికీ అవార్డు వేడుక‌లు స‌హా అగ్ర హీరోల‌ సినిమాల‌కు సుమ మాత్ర‌మే యాంక‌రింగ్ చేయాలి అన్నంతగా ప‌రిశ్ర‌మ‌ని శాసిస్తోంది. ఇక బుల్లి తెర‌పైనా సుమ‌ది అంద‌వేసిన చేయి. బుల్లి తెర యాంక‌ర్లంతా అక్కా అంటూ సుమ‌ను బుట్ట‌లో వేసుకుంటారు. స్టేజ్ పై సుమ‌తో మాట్లాడాలంటే ఒణికిపోవాలి అన్నంత‌గా అంద‌ర్నీ కంట్రోల్ చేస్తుంది. న‌వ‌త‌రం యాంక‌ర్ల‌కు సుమ ఒక మార్గ‌ద‌ర్శిగా ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

యాంక‌రింగ్ అంటే ఒక‌రిపై ఒక‌రు పంచులు వేసుకోవ‌డం ద‌గ్గ‌ర నుంచి హుందాగా డీల్ చేయ‌డం వ‌ర‌కూ సుమ ఆల్వేస్ ఎవ్వెర్ గ్రీన్. సుమ‌తో మాట్లాడాలంటే ముందే ప్రిపేర్ అయి రావాల‌ని చెప్పిన స్టార్ హీరోలు ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఓ సంద‌ర్భంలో సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవే ఆ మాట అన్నారంటే? సుమ ఎంత మాట‌కారో చెప్పాల్సిన ప‌నిలేదు. తాజాగా ఇదే విష‌యాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ `ఇచ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గుర్తు చేసారు. సుమ యాంక‌ర్ అని తెలిస్తే చిరంజీవిగారు స్టేజ్ ఎక్కే ముందు ప్రిపేర్ అయి వ‌స్తారు. ఆమెను డీల్ చేయ‌డం చిరంజీవి గారి వ‌ల్లే కాలేదు. ఆమె కోసం అక్కినేని నాగేశ్వ‌రరావు గారు మాత్ర‌మే హ్యాండీల్ చేయ‌గ‌ల‌రు.

ఆమెలో అంత మంచి మాట‌కారి ఉన్నారు. ప‌బ్లిక్ వేదిక‌ల‌పై మాట్లాడ‌టం అంత సుల‌భం కాదు. వేల మంది జ‌నాల ముందు మాట్లాడాలంటే గట్స్ ఉండాలి. అందులోనూ జ‌నాల్ని ఎంట‌ర్ టైన్ చేస్తూ మాట్లాడ‌టం అంటే క‌త్తి మీద సాము. సుమ‌గారు మాత్ర‌మే అలా హ్యాండిల్ చేయ‌గ‌ల‌రు. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ ఇలాంటి వేదిక‌ను పంచుకోవ‌డం సంతోషంగా ఉంది. క‌రోనా మొద‌లైన త‌ర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావ‌డం ఇదే తొలిసారి అని త్రివిక్ర‌మ్ తెలిపారు.




Tags:    

Similar News