నల్లగా ఉన్నవాళ్లే గొప్ప నటీమణులయ్యారు.. అలనాటి నటి అర్చన

Update: 2020-11-17 07:30 GMT
సినిమాల్లో రాణించాలంటే గొప్పనటిగా ఎదగాలంటే రంగు ముఖ్యం కాదు.. నల్లగా ఉన్నవాళ్లు కూడా గొప్పనటీమణులయ్యారు’ అని అలనాటి నటి అర్చన అభిప్రాయపడ్డారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఓ తెలుగు మీడియా చానల్​కు ఇంటర్వ్యూ  ఇచ్చారు. అప్పట్లో ఆమె నటించిన ‘ఆకాశం ఏనాటిదో.. అనురాగం అనాటిది’పాట ఎంత హిట్​ అయ్యిందో తెలిసిన విషయమే.. అయితే చాలా కాలం తర్వాత ఆమె  మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ‘సీరియస్​ సినిమాల్లో నటించడం తెలికే. కానీ కామెడీ రోల్స్​ చేయడమే కష్టం. కామెడీ చేయాలంటే టైమింగ్​ ఉండాలి.

ఒక నల్లని అమ్మాయి కనక  స్క్రీన్​ ముందుకొస్తే ఈ కెమెరా మెన్లకు లడ్డులు తింటున్నట్టు ఉంటుంది. అంత ఇష్టపడతారు. మంచి నటీమణులను చూస్తే వారంతా దాదాపు నల్లగా ఉన్న మహిళలే’ అంటూ తన కలర్​ కెరీర్​కు సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె పంచుకున్నారు. కొత్త అమ్మాయి సినిమాకు పనికిరాదు.. ఇలాంటి కారణాల వల్ల తనని కొన్ని సినిమాలను రిజెక్ట్​ చేశారని అర్చన నాటి రోజులను గుర్తుచేసుకున్నారు.

అర్చన 80లలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. భారత్ బంద్, చక్రవ్యూహం, మట్టి మనుషులు, నిరీక్షణ,  లేడీస్ టైలర్ వంటి సినిమాల్లో ఆమెకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. తమిళంలోనూ ఆమె మంచి నటిగా ఇమేజ్ తెచ్చుకున్నారు. 1988, 89 సంవత్సరాల్లో వరుసగా జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందిన రికార్డు సృష్టించారు.
Tags:    

Similar News