కోట్ల రూపాయ‌లుంటే ఖ‌ర్చు చేసేయాలా?

Update: 2022-06-30 02:30 GMT
సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీ మోహ‌న్ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోగా..క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో న‌టించారు. అటుపై రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్క‌డా ఓ వెలుగు వెలిగారు.  కొంత కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. వ్యాపారాలు పైనే శ్ర‌ద్ద పెట్టారు. స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య‌మైన పాత్ర‌లు వ‌స్తే చేస్తున్నారు. లేదంటే  బిజినెస్ ప‌నుల్లోనే నిమ‌గ్న‌మ‌వుతున్నారు.

ఇక ముర‌ళీ మోహ‌న్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ర్టీలో అడుగు పెట్టి  ఉన్న‌త స్థానానికి చేరుకున్నారు. సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌నే ఆయ‌న సంపాద‌న మొద‌లైంది. అటుపై అదే సంపాద‌న‌ వ్యాపారంలో పెట్టుబ‌డులు పెట్టి  స‌క్సెస్ అయ్యారు. అయితే  తెలుగు ఇండ‌స్ర్టీలో పిసినారిగా ముర‌ళీ మోహ‌న్ తో పాటు..స్వర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు  పేర్లు ముందు వ‌రుస‌లో ఉంటాయ‌ని చాలా కాలంగా వినిపిస్తుంది. తాజాగా ఇదే ప్ర‌శ్న ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ముర‌ళీ మోహ‌న్ ముందుకు తీసుకెళ్తే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.

నా సంపాద‌న మొద‌లైన త‌ర్వాత ఎక్క‌డా అన‌వ‌స‌ర ఖ‌ర్చులు చేసే వాడిని కాదు. జాగ్ర‌త్త‌గా బ్యాంక్ లో దాచుకేనే వాడిని. లిమిటెడ్ గా ఖ‌ర్చుల‌కు ఇంత అని కేటాయించి మిగ‌తాది సేవ్ చేసేవాడిని. అప్ప‌ట్లో  ల‌క్షాది కారి అవ్వాల‌న్న‌ది డ్రీమ్. 90 వేలు పోగు చేసాను. చివ‌రి 10 వేలు పోగేయ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది.

కానీ ఈలోపు ఏదో ఖ‌ర్చు వ‌చ్చేది. 90 నుంచి 1 కి రావ‌డానికి ఏడాది ప‌ట్టింది. ఆ తృప్తితో  పిల్ల‌ల్ని బ‌య‌ట‌కు తీసుకెళ్లి పార్టీ ఇచ్చాను. త‌ర్వాత పియ‌ర్డ్ కారు కొనాల‌ని  సంక‌ల్పించాను. అప్ప‌ట్లో ఆ కారు బుక్ చేస్తే ఏడాది..రెండేళ్ల త‌ర్వాత వ‌చ్చేది. కానీ  అనుకోకుండా ఆడ‌బ్బులు వేరే వాళ్లు వాడుకున్నారు. త‌ర్వాత కొన్ని నెల‌ల‌కి కారు కొన్నాను.

నాకు క‌ష్టం విలువ తెలుసు. చిన్న‌ప్పుడు ఊళ్లో పాలు పోసే స్థాయి నుంచి ఇంత వ‌ర‌కూ చేర‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డ్డాను. నేను చేసేది పిసినారి త‌నం కాదు.  అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెట్ట‌ను. ప్లైట్ లో వెళ్ల‌డానికి బ‌ధులు రైలులో ప్ర‌యాణం చేస్తాను. రాజ‌మండ్రి ఎంపీగా ఉన్న‌ప్పుడు కొన్నిసార్లు రైలులో వెళ్లేవాడిని. రైలు టిక్కెట్ ప్రీ.. నాతో పాటు అసిస్టెంట్ల‌కు కూడా.

అదే ప్లైట్ అయితే ఆ ఫెసిలిటీ ఉండ‌దు. అర్జెంట్ గా రాజ‌మండ్రి వెళ్లాల్సి వ‌స్తే ప్లైట్ కే  వెళ్లేవాడిని. నాకున్న డ‌బ్బుతో ఐదెక‌రాల్లో పేల‌స్ క‌ట్టుకుని ఉండొచ్చు. కానీ చిన్న ప్లాట్  లో ఉంటాను. అదే పెద్ద‌గా అనిపిస్తుంది. నాకు అలా ఉండ‌టమే ఇష్టం. పిల్ల‌లు వేర్వేరు చోట స్థిర‌ప‌డ్డారు. ఇళ్లు క‌ట్టుకునే ఏం చేసుకోవాలి. స‌మాజా సేవ చాలా మంచిది.

నేను ప్ర‌తీ 20 కుటుంబాల‌కు స‌హాయం చేస్తుంటాను. కానీ ఈ విష‌యం ఎవ‌రికి తెలియ‌దు.  పేప‌రు ప్ర‌క‌ట‌న‌లు నాకు ఇష్టం ఉండ‌దు. కొంత మంది విరాళాలుగా  ఎంతైనా ఇస్తారు. దాన్ని త‌ప్పు అన‌ను.  బాల‌కృష్ణ చిన్న‌ప్పుడే గోల్డెన్ స్పూన్. అత‌ని వ‌ద్ద‌కు వెళ్లి స‌హాయం అంటే ఎంతైనా ఇచ్చేస్తారు. అది అత‌ని విధానం. ఎవ‌రి ఇష్టం వ‌చ్చిన‌ట్లు వారుండొచ్చు త‌ప్పేముంది అని అన్నారు.
Tags:    

Similar News