• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీనియర్ నటుడు కైకాల...

సీనియర్ నటుడు కైకాల ఆరోగ్య పరిస్థితి విషమం

By - Tupaki Desk
Update: 2021-11-22 06:30 GMT
టాలీవుడ్ మోస్ట్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో రెండు రోజులుగా ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. తాజాగా వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం ఆయన ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని, అయితే బీపీ లెవల్స్ తక్కువగానే ఉన్నాయని తెలిపారు. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సీనియర్ నటుడైన కైకాల సత్యనారాయణ చివరగా మహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సినిమాలో కనిపించారు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు మూడు తరాల వారికి పరిచయ నటుడిగా ఉన్న సత్యనారాయణ కు విలక్షన నటుడిగా పేరుంది. విలన్ గా ప్రస్థానమైన ఆయన సినీ జీవితం క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడింది. వందల కొద్దీ సినిమాల్లో నటించిన ఆయన పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. ఓ వైపు కమెడియన్ గా.. మరోవైపు విలన్ గా.. సత్యనారాయణ తన నటనతో మెప్పించారు. తోటి నటులతో ఎంతో సౌమ్యంగా ఉండే కైకాల నాటి ఎన్టీఆర్ తో నటనపరంగా పోటీపడేవారు.

కైకాల పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న సత్యనారాయణ కొద్ది రోజుల కిందట ఆయన ఇంట్లో జారి పడ్డారు. దీంతో సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఆ తరువాత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ ప్రకటిస్తున్నారు.

దాదాపు 777 సినిమాల్లో నటించిన కైకాల సత్యనారాయణకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. ఆయన సినీ ఇండస్ట్రీలోనే నిర్మాతగా పనిచేస్తున్నారు. ‘కేజీఎఫ్’ మొదటి సినిమా నిర్మాతల్లో సత్యానారాయణ కుమారుడు ఒకరు. 60 ఏళ్లుగా సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్న ఆయన ఏ పాత్ర అయినా చేయడానికికి వెనుకాడలేదు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి పై సినీ ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Tags:    
  • kaikala satyanarayana 
  • kaikala satyanarayana movie 
  • kaikala satyanarayana helth update 
  • kaikala satyanarayana 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS