• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పొగడ్తలతో అఖిల్ భామకి...

పొగడ్తలతో అఖిల్ భామకి ఆఫర్లొస్తాయా?

By - Tupaki Desk
Update: 2016-07-04 13:30 GMT
అఖిల్ హీరోయిన్ సాయేషా సైగల్ సైమా అవార్డుల్లో డ్యాన్సులు కుమ్మేసిన సంగతి ఇంతకు ముందే చెప్పేసుకున్నాం. ఇప్పుడీ సుందరాంగి తను తెగ హ్యాపీగా ఉన్నానంటోంది. ఇందుకు కారణం.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఈమె గురించి ఆరా తీయడమే. సైమా ఫంక్షన్ లో చిరు వేసిన వీణ స్టెప్ ని అలవోకగా వేసి చూపించడంతో.. సాయేషా సైగల్ డ్యాన్సింగ్ ట్యాలెంట్ పై చాలామందికి నమ్మకం కుదిరేసింది.

'ఇది నా మొదటి స్టేజ్ పెర్ఫామెన్స్. అందుకే మొదటిసారే గట్టి ఇంప్రెషన్ చూపాలని అనుకున్నాను. నేను ట్రైనింగ్ తీసుకున్న డ్యాన్సర్ నే అయినా.. తొలి సినిమా అఖిల్ లో నా ట్యాలెంట్ చూపేందుకు అంతగా ఛాన్స్ రాలేదు. అందుకే సైమా ఈవెంట్ ని నా డ్యాన్స్ ప్రతిభ చూపేందుకు వేదికగా ఎంచుకున్నాను' అని చెప్పింది సాయేషా సైగల్. ఈ వేడుకలో నలుగురు సీనియర్ హీరోల సాంగ్స్ కు డ్యాన్సులు చేసి అలరించిన తర్వాత.. ఈమె గురించి చిరు కూడా వాకబు చేశారు. ఈ విషయం తెలిసి బోలెడంత హ్యాపీగా ఉన్నానంటోంది అఖిల్ భామ.

'నేను స్టేజ్ పై పెర్ఫామ్ చేస్తున్నపుడు చిరంజీవి అక్కడ లేరు. కానీ డ్యాన్స్ గురించి విని ప్రత్యేకంగా చూశారని తెలిసింది. నా డ్యాన్స్ నచ్చిందని ఆయన చెప్పడంతో చాలా సంతోషంగా ఉన్నా' అంటోంది సాయేషా. చిరు నుంచి డ్యాన్స్ విషయంలో పొగడ్తలు వచ్చాయంటే అదేమీ చిన్న విషయం కాదు. తొలి సినిమా తర్వాత అంతగా ఆఫర్లు దక్కించుకోలేకపోయిన సాయేషా సైగల్ కు.. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఆఫర్స్ వెళ్లే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.
Tags:    
  • Sayesha saigal 
  • SIIMA 2016 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS