• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సావిత్రి పెళ్లి రహస్యం...

సావిత్రి పెళ్లి రహస్యం అలా బయటపడింది

By - Tupaki Desk
Update: 2018-05-05 14:30 GMT
మహానటి సావిత్రి వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక అంతు చిక్కని ప్రశ్నే. దానిపై జనాలకు అనేక సందేహాలున్నాయి. తమిళ కథానాయకుడు జెమెని గణేశన్‌కు ఆకర్షితురాలు కావడం.. ఆయన్ని రహస్యంగా పెళ్లి చేసుకోవడం.. డబ్బులన్నీ పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో పడటం.. చివరి రోజుల్లో బాగా ఇబ్బంది పడటం.. ఇలాంటి విషయాలపై జనాలకు స్పష్టమైన సమాచారం లేదు. ఎవరికి వాళ్లు ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు సావిత్రి గురించి. ఈ సందేహాలన్నింటికీ ‘మహానటి’ సినిమా సమాధానం ఇస్తుందని.. సావిత్రి జీవితంపై పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. సావిత్రి కొడుకు.. కూతురు కూడా ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉండటంతో చాలా వరకు వాస్తవాలు తెలుస్తాయని అంచనా వేస్తున్నారు. కాగా సినిమాలో కంటే ముందు సావిత్రి జీవితంలోని ఆసక్తికర విషయం ఒకదాన్ని చిత్ర బృందం బయటపెట్టింది.

సావిత్రి రహస్య వివాహం అసలు ఎలా బయటికి వచ్చిందన్నది వెల్లడించారు. జెమిని గణేశన్ ను పెళ్లి చేసుకున్న కొంత కాలానికి సావిత్రి ఒక కార్యక్రమంలో పాల్గొని.. అక్కడ సంతకం చేయాల్సి వచ్చిందట. తెలిసి చేసిందో తెలియక చేసిందో కానీ తన పేరును అక్కడ ‘జెమిని గణేశన్’గా పేర్కొందట సావిత్రి. ఆ విషయం బయటికి పొక్కి పత్రికల్లో ఇది పెద్ద వార్త అయింది. ఆ తర్వాత అటు సావిత్రి.. ఇటు జెమిని గణేశన్ ఇద్దరూ తమ పెళ్లి గురించి అంగీకరించారు. మరోవైపు సావిత్రి జీవిత చరమాంకంలో ఆమె ఆరోగ్యం గురించి తనయురాలు విజయ ఛాముండేశ్వరి ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది. సావిత్రి అనారోగ్యంతో 19 నెలల పాటు కోమాలో ఉన్నట్లు చెప్పింది. ఆ సమయంలో తన తండ్రి ఆమెను పట్టించుకోలేదన్న సంగతి అబద్ధమని అంది. ఆ 19 నెలలూ ఆయన బాధ పడని రోజు లేదంది. సావిత్రికి ముందే షుగర్ ఉండేదని.. దీనికి తోడు వేరే ఆరోగ్య సమస్యలు.. ఒత్తిళ్లు తోడై ఆమె కోమాలోకి వెళ్లిపోయిందని చాముండేశ్వరి చెప్పింది.

Tags:    
  • Savitri 
  • Gemini Ganesan 
  • Secret Marriage 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS