నమో వెంకటేశాయ చేయనంటే చేయనన్నాడట..

Update: 2017-01-22 09:40 GMT
అన్నమయ్య.. శ్రీరామదాసు.. రాఘవేంద్రరావు తీసిన ఈ రెండు ఆధ్యాత్మిక చిత్రాల్లో దేవుడి పాత్ర పోషించింది సుమన్. ఐతే ‘ఓం నమో వేంకటేశాయ’కు మాత్రం సుమన్ ను కాదని.. ఉత్తరాది నటుడు సౌరభ్ జైన్ ను ఎంచుకున్నాడు రాఘవేంద్రుడు. ఐతే రాఘవేంద్రరావు లాంటి దర్శకుడు సౌరభ్ విషయంలో అంత ఆసక్తి చూపిస్తే.. అతను మాత్రం ఈ సినిమా చేయడానికి ముందు నో అనేశాడట. ఈ పాత్ర చేయడానికి భయపడ్డాడట.

‘‘ఒక రోజు హైదరాబాద్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఓ ఆధ్యాత్మిక చిత్రం తీస్తున్నామని.. నేను నటించాలని అన్నారు. ఐతే ఇదివరకే సీరియళ్లలో శ్రీకృష్ణుడు.. విష్ణువు పాత్రలు చేశాను.  మళ్లీ ఆ తరహా పాత్రలు చేయాలంటే ఎందుకో భయపడ్డా. నాపై ఇలాంటి ముద్రే పడిపోతుందనుకొన్నా. అందుకే ‘నో’ చెప్పేశాను. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు స్వయంగా మాట్లాడి నన్ను హైదరాబాద్ కు పిలిపించారు. ఒకసారి కథ.. పాత్ర గురించి విని.. ఆ తర్వాత నిర్ణయం తీసుకోమని అన్నారు. రాఘవేంద్రరావు గారితో పాటు నాగార్జున.. గోపాల్‌ రెడ్డిలతో సమావేశమయ్యాను.

వాళ్లు ఇచ్చిన నరేషన్ విన్నాక ఎలాంటి సినిమా తీయబోతున్నారో.. నా పాత్ర ఎలా ఉంటుందో అర్థమైంది. ఈ సినిమాని వదులుకొంటే నా అంత పిచ్చివాడు.. మూర్ఖుడు ఉండడు అనిపించింది. అందుకే ఇంకేం ఆలోచించకుండా ఒప్పుకున్నా. ముందు భాష విషయంలో ఇబ్బంది పడ్డా.. నాకోసం ప్రత్యేకంగా ఓ శిక్షకుడిని పెట్టి రాఘవేంద్రరావు గారు సమస్య రాకుండా చేశారు. ఈ సినిమా అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. రాఘవేంద్రరావు.. నాగార్జున లాంటి దిగ్గజాలతో కలిసి పని చేయడం.. ఓ గొప్ప సినిమాలో భాగమవడం.. ఈ తృప్తి నాకు చాలు’’ అని సౌరభ్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News