• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజమౌళి కంటే ముందు...

రాజమౌళి కంటే ముందు అతడితో..

By - Tupaki Desk
Update: 2018-06-09 07:40 GMT
తెలుగు సినీ చరిత్రలో బాగా పేరుమోసిన పెద్ద బేనర్లలో దుర్గా ఆర్ట్స్ ఒకటి. ఈ బేనర్ మీద ‘హలో బ్రదర్’ సహా ఎన్నో భారీ సినిమాలు నిర్మించాడు కె.ఎల్.నారాయణ. ఐతే నిన్నటితరానికి చెందిన చాలామంది నిర్మాతల్లాగే ఇప్పటి ట్రెండును అందిపుచ్చుకోలేక నారాయణకూడా సినిమాలు తగ్గించేశారు. గత పదేళ్లుగా ఆయన్నుంచి సినిమాలే రాలేదు. అలాగని సినిమాలకు పూర్తిగా దూరం అయిపోలేదాయన. చాలా ఏళ్ల కిందటే దర్శక ధీరుడు రాజమౌళి నుంచి కమిట్మెంట్ తీసుకున్న నారాయణ.. అతడితో సినిమా చేసి మళ్లీ తన బేనర్ కు పూర్వ వైభవం తీసుకురావాలని ఆశిస్తున్నాడు. కానీ రాజమౌళితో సినిమా ఇప్పుడిప్పుడే ఓకే అయ్యేలా లేదు. నారాయణకు కచ్చితంగా సినిమా చేస్తానని రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పాడు. ఆయన కంటే ముందు కమిట్మెంట్ ఇచ్చిన డీవీవీ దానయ్యకు సినిమా చేస్తున్నాడు జక్కన్న.

ఇది పూర్తయ్యాక నారాయణకే రాజమౌళి సినిమా చేసే అవకాశముంది. ఐతే చాలా ఏళ్లుగా ప్రొడక్షన్ కు దూరంగా ఉంటున్న నారాయణ.. రాజమౌళితో సినిమా కంటే ముందు ఓ చిన్న సినిమా తీసి టచ్ లోకి రావాలని డిసైడయ్యాడు. అందుకే ‘శతమానం భవతి’ దర్శకుడు సతీశ్ వేగేశ్న డైరెక్షన్లో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ‘శ్రీనివాస కళ్యాణం’ చేస్తున్న సతీశ్.. ఇదవ్వగానే దుర్గా ఆర్ట్స్ సినిమా మొదలుపెట్టనున్నాడు. ఓ యువ కథానాయకుడు ఈ చిత్రంలో హీరోగా నటిస్తాడట. తాను ఇంతకుముందే రెడీ చేసి పెట్టిన కథతో సతీశ్ ఈ సినిమా తీయబోతున్నాడట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలవుతుంది. ఆ తర్వాతి ఏడాది రాజమౌళితో సినిమా మొదలుపెట్టాలన్న యోచనలోఉన్నాడు నారాయణ.
Tags:    
  • Satish Vegesna 
  • Durga Arts 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS