• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సర్కారు వారి పాట కథపై...

సర్కారు వారి పాట కథపై హింట్ ఇచ్చాడు

By - Tupaki Desk
Update: 2021-08-10 05:30 GMT
సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్‌ బాబు అభిమానులతో పాటు సినీ అభిమానలు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో మహేష్‌ బాబు లుక్ మొదటి నుండి ఆసక్తిని రేకెత్తించింది. అంతా ఊహించినట్లుగా.. ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా మహేష్‌ బాబు లుక్ ను సర్కారు వారి పాట టీజర్ లో దర్శకుడు చూపించారు. టీజర్‌ కన్నుల వింధుగా ఉండటంతో సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న సర్కారు వారి పాట సినిమా కథ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చలు జరుగుతున్నాయి. కథ ఇది అది అంటూ ఎంతో మంది ఎన్నో రకాలుగా ఊహించేసుకుంటున్నారు. ఈ సమయంలో చిత్ర దర్శకుడు సినిమా లోని మహేష్‌ బాబు పాత్రపై చిన్న హింట్ ఇచ్చాడు.

మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమాలో లోన్ రికవరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. బ్యాంకుల నుండి లోన్స్ తీసుకుని ఎగవేసే వారిని ముక్కు పిండి వసూళ్లు చేయడం లేదంటే వారి ప్రాపర్టీస్ ను సర్కారు వారి పాట అంటూ వేలం పాట వేయడం చేయిస్తూ ఉంటాడట. ఆ క్రమంలో ఆఫీసర్‌ కు తలిగిన పెద్ద చేపలు ఏంటీ.. వారి నుండి వందలు వేల కోట్ల రూపాయలను ఎలా రికవరీ చేశాడు అంటూ కథ గా ఉండే అవకాశం ఉంది. కొంతమంది బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు తీసుకుని ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్నారు. వారికి సంబంధించి కూడా కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో దర్శకుడు పరశురామ్‌ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొత్తానికి ఈ సినిమాను పెద్ద ఎత్తున తెరకెక్కిస్తున్న దర్శకుడు పరశురామ్‌ సూపర్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నట్లుగా మహేష్‌ బాబును సరికొత్తగా చూపించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. విదేశాల్లో చిత్రీకరణ చేశారు కనుక లోన్స్ కట్టకుండా విదేశాలకు పారిపోయిన వారిని కూడా లాక్కొచ్చేలా మహేష్‌ బాబు పాత్ర ఉంటుందని అంటున్నారు. సామాజిక అంశంను తీసుకుని దాన్ని కమర్షియల్‌ యాంగిల్‌ లో దర్శకుడు తెరకెక్కించడం జరుగుతుందని తెలుస్తోంది. టీజర్‌ లో సినిమా కథ గురించి మహేష్‌ బాబు పాత్ర గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు కాని సినిమాలో ఆయన పాత్ర చాలా జోవియల్‌ గా ఉంటుందని.. చాలా స్టైలిష్ గా హ్యాండ్‌సమ్‌ గా కనిపించబోతున్నట్లుగా అనిపిస్తుంది.

థమన్ అందించిన సంగీతంతో ఈ సినిమా మ్యూజికల్‌ హిట్‌ గా నిలుస్తుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించడం వల్ల కూడా సౌత్‌ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సర్కారు వారి పాట షూటింగ్‌ ను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌ వరకు ముగించేలా ప్లాన్‌ చేశారు. ఆ వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించేందుకు మహేష్‌ బాబు సిద్దం అవుతున్నాడని తెలుస్తోంది. త్రివిక్రమ్‌ మూవీలో మహేష్‌ కు జోడీగా పూజా హెగ్డే నటించబోతుందని అధికారిక ప్రకటన వచ్చింది.
Tags:    
  • Sarkaru Vaari Paata 
  • Mahesh Babu 
  • Parasuram 
  • Sarkaru Vaari Paata Updates 
  • keerthy suresh 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS