ఆ హీరోయిన్‌కు పెళ్లంటే ఇల్ల‌రికం రావాల్సిందే

Update: 2022-01-04 03:30 GMT
సైఫ్ అలీఖాన్ న‌ట వార‌స‌త్వాన్నందుకుని బాలీవుడ్లోకి అడుగు పెట్టిన అమ్మాయి సారా అలీ ఖాన్. కేదార్ నాథ్, సింబా, ల‌వ్ ఆజ్ క‌ల్-2 చిత్రాల‌తో ఆమెకు మంచి పేరే వ‌చ్చింది. తాజాగా అత్రంగిరే మూవీతో మంచి మార్కులు వేయించుకుంది సారా. చేతిలో మ‌రిన్ని క్రేజీ ప్రాజెక్టులు పెట్టుకుని మంచి కెరీర్ దిశ‌గా అడుగులు వేస్తున్న ఈ అమ్మాయి వ‌య‌సిప్పుడు 26 ఏళ్లు. ఐతే ఇంత వ‌య‌సొచ్చినా తాను ఇంకా చిన్న పిల్ల‌నే అని, ఇప్ప‌టికీ త‌న త‌ల్లి మీదే అన్నిటికీ ఆధార‌ప‌డుతాన‌ని అంటోంది సారా. పెళ్ల‌య్యాక కూడా త‌న‌లో మార్పేమీ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, త‌న త‌ల్లి లేకుండా ఉండ‌లేన‌ని.. కాబ‌ట్టి త‌న‌ను పెళ్లి చేసుకునే వ్య‌క్తి ఇల్ల‌రికం రాక త‌ప్ప‌ద‌ని సారా వ్యాఖ్యానించ‌డం విశేషం.

త‌న కొత్త చిత్రం అత్రంగి రే స‌క్సెస్ మీట్లో మాట్లాడుతూ సారా ఈ వ్యాఖ్య‌లు చేసింది. ఈ సినిమా చూసి త‌న త‌ల్లిదండ్రులు క‌న్నీళ్లు పెట్టుకున్న‌ట్లు సారా వెల్ల‌డించింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. నాకు అమ్మే సర్వస్వం. ఆమెతో ఉంటే సంతోషంగా ఉంటా. ఆమె నాకు ఓ ఇల్లు లాంటిది. ప‌నిలో భాగంగా ఎక్కడికి వెళ్లినా చివరికి తిరిగి ఇంటికి ఎలా చేరుకుంటామో అదే మాదిరిగా ఎన్ని పనుల్లో బిజీగా ఉన్న అమ్మతోనే సమయాన్ని గడపటానికి ఇష్టపడుతుంటా. అంతేకాకుండా కొన్ని విషయాల్లో నాకు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం రాదు. ఇప్పటికీ నేను బయటకు వస్తే ఎలా రెడీ అవ్వాలో అమ్మే చెబుతుంటుంది. మా ఇద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉంది. ఆమెను వదిలి ఉండటం నా వల్ల కాదు. కనుక భవిష్యత్తులో నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి ఇల్లరికం వచ్చేందుకు ఒప్పుకోవాల్సి ఉంటుంది అంటూ త‌న జీవితంలో త‌ల్లి అమృతా సింగ్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని చెప్ప‌క‌నే చెప్పింది సారా. అమృతాతో 13 ఏళ్ల వైవాహిక బంధం త‌ర్వాత సైఫ్ ఆమె నుంచి విడిపోయి క‌రీనా క‌పూర్‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News