#DRUGS లో NCB సమన్లు అందుకున్న నటి అదృశ్యం?

Update: 2020-10-23 06:50 GMT
డ్రగ్స్ కేసులో ఎన్‌.సి.బి సమన్లు అందుకున్న కామోషియాన్ నటి సప్నా పబ్బీ `అదృశ్యమైందా`? సుశాంత్  కేసుకు సంబంధించిన డ్రగ్స్ ఉచ్చులో సప్నా పబ్బీ పేరును డ్రాగ్ చేసి విచార‌ణ‌కు హాజరు కావాలని కోరగా ఆమె మిస్స‌య్యింది అంటూ సామాజిక మాధ్య‌మాల్లో జాతీయ మీడియాలోనూ ఆస‌క్తిక‌ర డిబేట్ ర‌న్ అవుతోంది.

న‌టి అదృశ్యం అన్న వార్త‌తో స‌ర్వ‌త్రా హీటెక్కిపోతోంది. బాలీవుడ్ అగ్రశ్రేణి నటీమణులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించిన తరువాత సాప్నా ప‌బ్బీని ఇప్పుడు మాదక ద్రవ్యాల నిరోధ‌క సంస్థ ఎన్‌.సి.బి విచార‌ణ‌కు పిలిపించింద‌ని ప్ర‌ఖ్యాత‌ మిడ్-డే క‌థ‌నం వెల్ల‌డించింది. ఆ క‌థ‌నం ప్రకారం... కామోషియాన్ నటి సప్నా పబ్బీని ఎన్.‌సి.బి పిలిపించింది. కానీ అధికారులు ఆమెను ట్రేస్ చేయ‌లేక‌పోతున్నార‌ట‌. ముంబైలోని తన నివాసానికి జారీ చేసిన సమన్లకు కూడా పబ్బీ సమాధానం ఇవ్వలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసుకు సంబంధించిన డ్రగ్స్ కేసుకు సంబంధించి హాజరు కావాలని సప్నాను కోరినా ఎలాంటి రెస్పాన్స్ లేద‌ని స‌ద‌రు జాతీయ మీడియా నివేదిస్తోంది.

అర్జున్ రాంపాల్ భాగస్వామి గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ సోదరుడు అయిన‌ అగిసిలాస్ డెమెట్రియేడ్స్ ను అరెస్టు చేసిన తరువాత సప్నా పేరు బయటపడిందని ఎన్.‌సి.బి అధికారులు స‌ద‌రు వెబ్ పోర్టల్ ‌కు వెల్లడించారు. ఈ విషయంపై ఎన్.‌సి.బి అధికారి ఒకరు మాట్లాడుతూ... బాలీవుడ్ డ్రగ్ సిండికేట్ ‌కు సంబంధించి ఎన్‌సిబి ముందు హాజరుకావాలని కోరుతూ మంగళవారం ఆమె నివాసం వెలుపల నోటీసు అతికించారు. కానీ ఆమె స్పందించలేదు. ఇప్పుడు ఏకంగా అదృశ్యమైందని స‌ద‌రు క‌థ‌నం వెల్ల‌డించింది.

అగిసిలాస్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా..., కొన్ని డిజిటల్ ఆధారాలు బయటపడ్డాయని.., ఇది సప్నా పబ్బీ డ్రగ్ నెక్సస్ ‌లో కూడా ఉండి ఉండొచ్చని అధికారులు తెలిపారు. బుధవారం నాడు గాబ్రియెల్లా సోదరుడు అగిసిలాస్ మాదకద్రవ్యాలను కలిగి ఉన్నట్లు గుర్తించిన తరువాత నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ఎన్‌సిబి అధికారి ఒకరు ఈ డెవ‌ల‌ప్ మెంట్ ని అధికారికంగా ధృవీకరించారని వెల్ల‌డైంది. ముంబైలోని లోనావాలా ప్రాంతంలోని ఒక రిసార్ట్ లో డెమెట్రియేడ్స్ ను అరెస్టు చేశారు. అతని వద్ద నుండి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. భారతదేశంలో నిషేధించబడిన ఆల్ప్రజోలం అనే టాబ్లెట్ ను అతని ఇంటిపై జ‌రిపిన దాడిలో స్వాధీనం చేసుకున్నారు.
Tags:    

Similar News