• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షారుక్ క‌నిపిస్తే కాల్చి...

షారుక్ క‌నిపిస్తే కాల్చి బూడిద చేస్తాడ‌ట‌!

By - Tupaki Desk
Update: 2022-12-21 14:55 GMT
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ న‌టిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `ప‌ఠాన్‌` చుట్టూ రోజుకో వివాదం రాజుకుంటోంది. సిద్ధార్ధ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్ పై ఆదిత్య చోప్రా రూ. 250 కోట్ల బ‌డ్జెట్ తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నాడు. దీపికా ప‌దుకునే హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ మూవీ చుట్టూ వివాదం అలుముకుంటున్న విష‌యం తెలిసిందే. రీసెంట్ గా షారుక్‌, దీపిక‌ల‌పై చిత్రీక‌రించిన `బేష‌ర‌మ్ రంగ్‌` అంటూ సాగే బీచ్ సాంగ్ వీడియోని మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ఈ పాట‌లో దీపిక ప‌దుకునే టూపీస్ బికినీ ధ‌రించి అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ చేయ‌డంతో ఈ వీడియో పై వివాదం చెరేగింది. అంతే కాకుండా ఈ పాట‌లోని చివ‌రి చ‌ర‌ణాల్లో దీపిక కాషాయ రంగు బికినీ ధ‌రించి క‌నిపించ‌డం మ‌రింతగా వివాదానికి ఆజ్యం పోసింది.

ఈ నేప‌థ్యంలో ఈ సినిమాలోని ఆ పాట‌లో దీపిక ధ‌రించిన డ్రెస్ ల‌ను స‌రి చేయాల‌ని కొంత మంది.. లేదు లేదు `ప‌ఠాన్‌` మూవీని బ్యాన్ చేయాల‌ని మ‌రి కొంత మంది సినిమాపై మండిప‌డ్డారు.

మిందూ సంఘాలు చాలా వ‌రకు `బేష‌ర‌మ్ రంగ్‌` సాంగ్ పై తీవ్ర అభ్యంత‌రాన్ని వ్యక్తం చేశారు. షారుక్ సినిమాని బ్యాన్ చేయాల్సిందే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు, శ‌క్తిమాన్ న‌టుడు సైతం ఈ సాంగ్ పై నిప్పులు చెరిగిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఓ సాధువు షారుక్ ఖాన్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అయోధ్య‌కు చెందిన సాధువు ప‌ర‌మ హంస్ ఆచార్య మాట్లాడుతూ షారుక్ ఖాన్ త‌న కంట ప‌డితే అక్క‌డిక‌క్క‌డే అత‌న్ని ద‌హ‌నం చేస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

అంతే కాకుండా `ప‌ఠాన్` సినిమాని ప్ర‌ద‌ర్శిస్తే గ‌న‌క ఆ థియేట‌ర్ల‌ని కూడా త‌గ‌ల‌బెడ‌తాన‌ని తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించాడు. బేష‌ర‌మ్ సాంగ్ లో కాషాయాన్ని అవ‌మానించార‌ని, `ప‌ఠాన్‌` సినిమాను బ‌హిష్క‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఇంత‌కు ముందు ఇదే త‌ర‌హాలో ప‌లువురు సాధువులు `ప‌ఠాన్‌` సినిమాపై, దీపిక న‌టించిన పాట‌పై తీవ్ర‌ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కానీ అయోధ్య‌కు చెందిన సాధువు ప‌ర‌మ హంస్ ఆచార్య త‌ర‌హాలో మాత్రం స్పందించ‌లేదు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై ఎలాంటి దుమారం రేగ‌నుందో వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • BesharamRang 
  • Song 
  • Pathaan 
  • movie 
  • SantParamhansAcharya 
  • ShahRukhKhan 
  • DeepikaPadukone 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS