• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుట్టు లీక్: సినీ స్టార్...

గుట్టు లీక్: సినీ స్టార్ ప్రేమ‌లో టెన్నిస్ స్టార్

By - Tupaki Desk
Update: 2020-03-17 08:00 GMT
బాలీవుడ్ అంద‌గ‌త్తెల‌కు ధీటైన అందంతో మురిపించ‌డం సానియాకే చెల్లింది. టెన్నిస్ స్టార్ గా ద‌శాబ్ధాల పాటు హ‌శా సాగించిన సానియా మిర్జాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీర‌లెవ‌ల్లో ఫాలోయింగ్ ఉంది. ఒక సినిమా స్టార్ ని మించిన ఫాలోయింగ్ యూత్ లో త‌న‌కు ఉంది. కేవ‌లం ఆట‌తోనే కాదు తన‌దైన గ్లామ‌ర్ తోనూ ఈ ఫాలోయింగ్ తెచ్చుకోగ‌లిగింది. ఇక సానియా మిర్జా టెన్నిస్ కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్న స‌మ‌యంలో సినిమాల్లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌న్న ప్ర‌చారం సాగింది. అంతేకాదు ఓ సినీహీరోని ప్రేమించింద‌న్న ర‌హ‌స్యం తాజాగా ఓపెన్ అయ్యింది.

ప్ర‌స్తుతం సానియాకి పెళ్ల‌య్యింది. ఒక బిడ్డకు జ‌న్మ‌నిచ్చి మాతృత్వాన్ని ఆస్వాధిస్తున్నారు. పాక్ క్రికెట‌ర్ సోయ‌బ్ మాలిక్ ని పెళ్లాడిన సానియా అంత‌కుముందు ఎవ‌రినైనా ప్రేమించారా? అంటే.. అవున‌నే తాజాగా క‌ర‌ణ్ జోహార్ బ‌య‌ట‌పెట్టేయడం వేడెక్కిస్తోంది. సానియా టెన్నిస్ స్టార్ గా ఎదిగే క్ర‌మంలోనే బాలీవుడ్ చాక్లెట్ బోయ్ షాహిద్ క‌పూర్ పై మ‌న‌సు పారేసుకుంద‌ట‌. అప్ప‌ట్లో అత‌గాడితో డేటింగులు కూడా చేసింది. అయితే ఇదే విష‌యాన్ని ప్ర‌శ్నిస్తే మాత్రం... సానియా చెప్పే ఆన్స‌ర్ షాకింగ్ గానే ఉంది.

ద‌ర్శ‌క‌నిర్మాత‌.. టీవీ హోస్ట్ కరణ్ జోహర్ తన రియాలిటీ షోలో సానియాతో షాహిద్ ప్రేమ టాపిక్ అభిమానుల్లో వైర‌ల్ గా చ‌ర్చ‌కు వ‌చ్చింది. సానియా ఆ విష‌యంపై క‌రణ్ ముందు ప్ర‌స్థావించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌లేదు. షాహిద్ తో డేటింగ్ చేశారనే రూమర్లు వచ్చాయి... అవి నిజమేనా? అంటూ కరణ్ రెట్టించి ప్ర‌శ్నిస్తే.. దానికి సానియా స‌రిగా స్పందించ‌నేలేదు. ``షాహిద్ తో డేటింగ్ మ్యాట‌ర్ నాకు సరిగా గుర్తు లేదు. అది చాలా కాలం క్రితం నాటి మాట‌. నా జీవితంలో చాలా దూరం ప్రయాణించేశాను. ఇప్పుడు ఆ విషయం నాకే గుర్తుకు రావడం లేదు`` అంటూ న‌సిగేసింది సానియా. ఒక ర‌కంగా షాహిద్ తో ప్రేమ వ్యవహారాన్ని చెప్పకుండా సానియా దాటవేసేందుకు ప్రయత్నించారు.

అయితే షాహిద్ అప్ప‌టికే ఇద్ద‌రు భామ‌ల‌తో ప్రేమాయ‌ణం సాగించి శోభ‌న్ బాబులా రెండిళ్ల పూజారిలా బోలెడంత పాపులారిటీ తెచ్చుకున్నాడు. తొలుత ప్రియాంక చోప్రాని ప్రేమించి బ్రేక‌ప్ చెప్పేసిన చాక్లెట్ బోయ్ అటుపై క‌రీనా క‌పూర్ ని ప్రేమించాడు. ఈ మ‌ధ్య‌లోనే సానియాతోనూ ఎఫైర్ సాగించాడు. జ‌బ్ వియ్ మెట్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే బెబో క‌రీనా నుంచి షాహిద్ విడిపోయాడు. క‌రీనా ఆ త‌ర్వాత సైఫ్ ఖాన్ ని ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఇక షాహిద్ ని ప్రేమించ‌డం వ‌ల్ల‌నే సానియా టెన్నిస్ వ‌దిలి సినిమాల్లోకి వెళుతోంద‌న్న ప్ర‌చారం సాగిపోయింది అప్ప‌ట్లో. ఇక సానియా కొన్నాళ్ల పాటు షాహిద్ ని ప్రేమించినా అది ఎందుక‌నో వ‌ర్క‌వుట్ కాలేదు. కాల‌క్ర‌మంలో షాహిద్ కి దూర‌మై.. త‌ను పాక్ క్రికెట‌ర్ సోయ‌బ్ ని పెళ్లాడి సెటిలైపోయింది. ప్ర‌స్తుతం షాహిద్ .. దిల్లీకి చెందిన మీరా రాజ్ పుత్ ని పెళ్లాడి సెటిలైన సంగ‌తి తెలిసిందే. నార‌ద మ‌హ‌ర్షి లాంటి క‌ర‌ణ్ జోహార్ ఈ గుట్టు మ‌ట్లు అన్నీ వాళ్ల తోనే బ‌య‌టికే చెప్పించార‌న్న‌మాట‌!!


Tags:    
  • sania mirza dating with shahid kapoor revealed in karan johar show 
  • sania mirza dating with shahid kapoor 
  • sania mirza shahid kapoor 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • sania mirza 
  • shahid kapoor 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS