• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంకాస్త గెడ్డం కావాలట!

ఇంకాస్త గెడ్డం కావాలట!

By - Tupaki Desk
Update: 2018-08-21 06:24 GMT
ఒకప్పుడు సినిమాల్లో హీరో వేషానికి గెడ్డం కావాలంటే పెట్టుడు వాటి మీదే ఆధారపడి వాళ్ళు. కారణం హీరోలకు ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్స్ ఉండేవి కాబట్టి దేనికి ఇబ్బంది లేకుండా అలా పని కానిచ్చేసేవారు. కానీ అది ఎంత లేదనుకున్నా కృత్రిమంగానే ఉండేది. ఎంతైనా సహజంగా పెంచిన ఫీల్ పెట్టుడు గెడ్డం జుత్తుతో రాదు. అందుకే ఇప్పటి తరం హీరోలు దర్శకులు ఈ విషయంలో రాజీ కావడానికి  ఇష్టపడటం లేదు. రంగస్థలం కోసం రామ్ చరణ్ తేజ్ ఏడాదికి పైగా అంత పెద్ద గెడ్డంతోనే దేశాలు తిరిగాడు. అదే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిక్కు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కు వచ్చి పడింది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో ఇతను నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే దీని బాధ్యతలు తీసుకున్నాడు. ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలు చేసారు కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు.

దానికి కారణం షాహిద్ కపూర్ స్వయంగా చెబుతున్నాడు . సినిమాలో కొంత భాగం తప్ప ఆద్యంతం బాగా గుబురుగా పెరిగిన గెడ్డంతో కనిపించాలి కాబట్టి ప్రస్తుతం తను ఆ పనిలో ఉన్నాడట. అయితే ఆగస్ట్ లో మొదలుపెడదాం అనుకుంటే ఇప్పటిదాకా పెరిగిన గెడ్డం చూసి సందీప్ ఇంకాస్త పెంచమని కోరాడట. దీంతో సెప్టెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఇదే రకంగా చాలా కాలం పాటు అర్జున్ రెడ్డి కోసం గెడ్డంతోనే ఉన్నాడు.  ఇప్పుడు షాహిద్ వంతు వచ్చింది. అసలు షాహిద్ సెలెక్ట్ అయ్యింది కూడా ఉడతా పంజాబ్ లో అచ్చం ఇదే షేడ్స్ లో ఉండే డ్రగ్ ఎడిక్ట్ పాత్రను చూసే. షాహిద్ కొత్త సినిమా బత్తి గుల్ మీటర్ చాలు త్వరలో విడుదల కానుంది. దాని ప్రమోషన్ లో భాగంగానే షాహిద్ కపూర్ ఈ అర్జున్ రెడ్డి ముచ్చట్లు చెప్పుకున్నాడు. హిందీ వెర్షన్ టైటిల్ ఇంకా డిసైడ్ చేయాల్సి ఉంది.
Tags:    
  • Sandeep Vanga 
  • Shahid 
  • Arjun Reddy 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS