ఎక్స్‌ ప్రెస్‌ సెంటిమెంట్‌ కలిసి వచ్చి సక్సెస్‌ దక్కేనా?

Update: 2020-10-12 05:00 GMT
యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ వరుసగా సినిమాలు అయితే చేస్తున్నాడు కాని ఆశించిన స్థాయిలో సక్సెస్‌ లను మాత్రం దక్కించుకోలేక పోతున్నాడు. వరుసగా ఈయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నా కూడా సినిమాల ఎంపిక విషయంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు. వైవిధ్యభరిత సినిమాలు చేస్తూనే కమర్షియల్‌ మూవీస్‌ కు కూడా పెద్ద పీఠ వేస్తున్న సందీప్‌ కిషన్‌ ప్రస్తుతం ఎ1 ఎక్స్‌ ప్రెస్‌ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉంది. కాని కరోనా కారణంగా సినిమా విడుదల విషయంలో ఒక స్పష్టత లేకుండా పోయింది.

షూటింగ్‌ ను పూర్తి చేసి తదుపరి ఒక మంచి కథతో స్టార్‌ డైరెక్టర్‌ తో సినిమా చేయాలని సందీప్‌ కిషన్‌ భావిస్తున్నాడు. బడ్జెట్‌ కాస్త ఎక్కువ అయినా పర్వాలేదు కాని స్టార్‌ డైరెక్టర్‌ తో సొంతంగా సినిమాను నిర్మించాలని సందీప్‌ కిషన్‌ భావిస్తున్నాడట. ఎ1 ఎక్స్‌ ప్రెస్‌ సినిమా సక్సెస్‌ అయితే ఈయన్ను సీనియర్‌ దర్శకులు స్టార్‌ డైరెక్టర్స్‌ ఏమైనా ఈయన్ను చూస్తారేమో చూడాలి. వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌ సినిమాతో సందీప్‌ కిషన్‌ మొదటి కమర్షియల్‌ బిగ్గెస్ట్‌ సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. అందుకే మళ్లీ ఇప్పుడు టైటిల్‌ లో ఎక్స్‌ ప్రెస్‌ ను పెట్టడం వల్ల ఏమైనా సెంటిమెంట్‌ కలిసి వస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్‌ జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News