• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'సంచారి' సాంగ్ టీజర్:...

'సంచారి' సాంగ్ టీజర్: ప్రేమ కోసం 'రాధే శ్యామ్' ప్రయాణం..!

By - Tupaki Desk
Update: 2021-12-14 08:33 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ''రాధే శ్యామ్'' చిత్రం నుంచి మరో సాంగ్ రాబోతోంది. ఇప్పటికే విడుదలైన 'ఈ రాతలే' 'నగుమోము తారలే' వంటి పాటలు విశేషంగా అలరించారు. ఈ క్రమంలో 'సంచారి' అనే మూడో పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఈ పాటకు సంబంధించిన టీజర్ ను వదిలారు.

'రాధేశ్యామ్' సినిమా దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా... హిందీ వెర్సన్ కు మిథున్ - అనూ మాలిక్ - మనన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నాలుగు భాషల్లో వచ్చిన 'సంచారి' పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చగా.. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తనదైన శైలిలో ఎంతో హుషారుగా ఆలపించారు.

'చల్.. చలో.. సంచారి.. చల్ చలో.. కొత్త నేలపై' అంటూ సాగిన ఈ పాటకు కృష్ణకాంత్ (కెకె) సాహిత్యం అందించారు. ప్రేమనే గమ్యస్థానంగా ఎంచుకుని ప్రభాస్ చేసే ప్రయాణాన్ని ఈ టీజర్ లో చూడొచ్చు. అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ గీతం విజువల్ గా కూడా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ ఇందులో మంచు పర్వతాలలో స్కేటింగ్ చేస్తూ.. సైకిల్ మరియు కార్ లో ప్రయాణిస్తూ.. గుర్రాన్ని పట్టుకొని కనిపించాడు.

'సంచారి' ఫుల్ లిరికల్ సాంగ్ ను డిసెంబర్ 16 గురువారం విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమిళ మలయాళ కన్నడ భాషల్లో సత్య ప్రకాష్ ఈ గీతాన్ని ఆలపించారు. హిందీ వెర్షన్ 'ఉద్ జా పరిందే' పాటకు మిథున్ స్వరాలు సమకూర్చగా.. సింగర్ జూబిన్ పాడారు. హిందీలో ఇప్పటికే వచ్చిన 'ఆషికీ ఆ గయీ' 'సోచ్ లియా' పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి.

కాగా, 'రాధే శ్యామ్' చిత్రాన్ని ఇటలీ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. భాగ్యశ్రీ - జగపతిబాబు - ప్రియదర్శి - సత్యరాజ్ - కునాల్ రాయ్ క‌పూర్‌ - స‌చిన్ ఖేడ్కర్‌ - ముర‌ళి శ‌ర్మ‌ - ఎయిర్ టెల్ శాషా ఛ‌త్రి - రిద్ది కుమార్‌ - స‌త్యన్ కీలక పాత్రలు పోషించారు.

కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ - ప్రసీద - భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. కమల్‌ కన్నన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా.. రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనర్ గా వర్క్ చేశారు.

'రాధే శ్యామ్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

Full View
Tags:    
  • Prabhas 
  • Radhe Shyam 
  • Sanchari 
  • Prabhakaran 
  • Anirudh Ravichander 
  • Pooja Hegde 
  • Radha Krishna Kumar 
  • RRR 
  • Bheemla Nayak 
  • Radhe Shyam songs 
  • Radhe Shyam new pic 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS