• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘శమంతకమణి’లో హీరోయిన్ల...

‘శమంతకమణి’లో హీరోయిన్ల సంగతేంటి?

By - Tupaki Desk
Update: 2017-07-06 17:30 GMT
శమంతకమణి.. ఈ పేరుతో సినిమా మొదలైనప్పటి నుంచి జనాల్లో దానిపై మంచి ఆసక్తి నెలకొంది. మల్టీస్టారర్లు అరుదైన టాలీవుడ్లో నలుగురు యువ కథానాయకులు కలిసి ఓ సినిమా చేయడం.. పైగా దానికి ‘శమంతకమణి’ అనే పేరు పెట్టడం.. ‘భలే మంచి రోజు’తో మంచి పేరు సంపాదించిన శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు కావడమే ఆ ఆసక్తికి కారణం.

ఈ ఆసక్తికి తగ్గట్లే వైవిధ్యమైన మోషన్ పోస్టర్.. ఫస్ట్ లుక్ పోస్టర్లు..  టీజర్.. ట్రైలర్లతో ప్రేక్షకుల దృష్టిని మరింతగా ఆకర్షించింది ‘శమంతకమణి’. ఈ మధ్యే విడుదలైన ‘శమంతకమణి’ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని బాగా పెంచింది. ఐతే ఈ సినిమాకు సంబంధించి ముందు నుంచి హీరోలు మాత్రమే డిస్కషన్లో ఉన్నారు. నారా రోహిత్.. సుధీర్ బాబు.. సందీప్ కిషన్.. ఆది.. వీళ్లతో పాటు రాజేంద్ర ప్రసాద్ గురించి కూడా చాలా చర్చ జరిగింది. టీజర్.. ట్రైలర్లలో ఈ ఐదుగురూ బాగా హైలైట్ అయ్యారు.

కానీ ఇందులో లేడీ క్యారెక్టర్ల గురించే జనాలకు ఏ ఐడియా లేదు. అసలు ఇందులో హీరోయిన్లు ఉన్నారా అన్న డౌట్ కూడా ఉంది. కానీ ‘శమంతకమణి’లో ఒకరికి ముగ్గురు హీరోయిన్లుండటం విశేషం. కానీ ఆ ముగ్గురూ అంత పేరున్న వాళ్లు కాదు. ప్రోమోల్లో వారికి పెద్దగా చోటు దక్కలేదు. ట్రైలర్లో ఈ ముగ్గురు ఒక ఫ్లాష్ లాగా మెరిసి మాయమైపోయారు. ఆ ముగ్గురి పేర్లు.. చాందిని చౌదరి.. అనన్య.. జెన్నీ.

చాందిని ‘కుందనపు బొమ్మ’తో పాటు ఒకట్రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ‘బ్రహ్మోత్సవం’ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లోనూ నటించింది. అనన్య కొత్తమ్మాయి. జెన్నీ టీవీ రంగం నుంచి వచ్చింది. ఈ ముగ్గురూ మొన్నటి ఆడియో వేడుకలో బాగానే సందడి చేశారు. మరి సినిమాలో ఈ ముగ్గురికి ఇలాంటి పాత్రలుంటాయో.. వాళ్లెలా మెప్పిస్తారో ఈ నెల 14న తేలుతుంది. ఆ రోజే ‘శమంతకమణి’ రిలీజ్.
Tags:    
  • Heroines 
  • Samanthakamani 
  • Samanthakamani Movie 
  • Telugu NEWs 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS