మహేష్ తో సమంత జంట ...చెక్కేది జక్కన్న... ?

Update: 2021-11-14 10:39 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబో మీద ఇపుడు అందరి దృష్టి ఉంది. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ వర్క్ తో ఫుల్ బిజీగా ఉన్న జక్కన్న మరో వైపు వీలు చూసుకుని మహేష్ మూవీ పనులను కూడా లైన్ లో పెట్టేస్తున్నాడుట. ఈ మూవీకి సంబంధించి కాస్టింగ్, టెక్నీషియన్స్ విషయంలో చకచకా సెలెక్షన్ చేస్తున్నాడు అంటున్నారు. మహేష్ బాబు తో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా లెవెల్ లో మూవీ కాబట్టి హీరోయిన్స్ విషయంలో కూడా పెర్ఫెక్ట్ గా ఉండేలా జక్కన్న అన్నీ విధాలుగా చూస్తున్నాడుట.

ఇక ఆయన మదిలో ఇప్పటికైతే సమంత ది  బెస్ట్ చాయిస్ గా ఉందని అంటున్నారు. సమంత అయితే ఫ్యామిలీ మాన్ టూ లో నటించి పాన్ ఇండియా ఇమేజ్ ని ఇప్పటికే  సొంతం చేసుకుంది అన్నదే రాజమౌళి ఆలోచనట. ఆమెను హీరోయిన్ గా పెడితే మూవీకి అన్ని విధాలుగా బెస్ట్ అవుతుంది అని థింక్ చేస్తున్నారుట. ఇక మహేష్ సమంతా కాంబోలో రెండు సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. అందులో ఒకటి దూకుడు, రెండవది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ ఇద్దరూ చివరి సారిగా చేసిన సినిమా బ్రహ్మోత్సవం.

ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. అయినా సరే ఈ ఇద్దరి జంట మాత్రం అందరికీ కన్నుల పంటే అన్న గుడ్ టాక్ అయితే ఉంది. దాంతో మహేష్ బాబు సరసన సమంతను తీసుకోవడం ఖాయమే అంటున్నారు. సమంతా చేతిలో తెలుగులో చూస్తే శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద సినిమా ఒకటి ఉంది. గుణశేఖర్ శాకుంతలం మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఇవి కాకుండా కొత్తగా కమిట్ అయినవి అయితే లేవు.

తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటాలని సమంత భావిస్తున్న నేపధ్యంలో రాజమౌళితో మూవీ, మహేష్ బాబు తో జోడీ అంటే  ఎస్ అంటుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అన్నీ అనుకూలిస్తే మాత్రం ఈ జంటను ముందు పెట్టి జక్కన్న మ్యాజిక్ చేయడానికి రెడీ అంటున్నారు. ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ మ్యాటర్ ఏంటి అంటే బాహుబలి, ట్రిపుల్ ఆర్ మూవీస్ మాదిరిగా ఈసారి జక్కన్న ఏళ్లకు ఏళ్ళు సినిమాను చెక్కడట. వీలైనంత త్వరగా అంటే కనీసం ఒక ఏడాది గ్యాప్ లోనే మూవీని ఫినిష్ చేసి థియేటర్లకు తెస్తాడు అంటున్నారు. సో రాజమౌళిలో వచ్చిన ఈ చేంజ్ తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అంటున్నారు.
Tags:    

Similar News