• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామలక్ష్మితో కుమార్ బాబు...

రామలక్ష్మితో కుమార్ బాబు రెండోస్సారి

By - Tupaki Desk
Update: 2018-06-27 06:28 GMT
అక్కినేని కోడలయ్యాకే సమంతా స్పీడ్ పెరిగింది. ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్స్ కొడుతూ దూసుకుపోతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ పూర్తి చేసుకోగా రెండో దాని కోసం రెడీ అవుతోంది. రంగస్థలం-మహానటి-అభిమన్యుడు సక్సెస్ లలో తనది కూడా మేజర్ షేర్ ఉండటం సమంతా ఫాన్స్ కు భలే కిక్ ఇస్తోంది. గ్లామర్ షో కాకుండా అన్నింటినోను ప్రాధాన్యత ఉన్న పాత్రలే దక్కడం పట్ల సామ్ కూడా హ్యాపీగా ఉంది. ఇకపై కూడా కథల విషయంలో జాగ్రత్తగా ఉంటానని చెబుతున్న సమంతా కొత్త సినిమా యు టర్న్ షూటింగ్ చివరి దశలో ఉంది.

రెండేళ్ల క్రితం కన్నడ లో ఇదే టైటిల్ తో వచ్చిన బ్లాక్ బస్టర్ రీమేక్ గా వస్తున్న ఈ మూవీ కి దర్శకుడు పవన్. ఒరిజినల్ తీసింది కూడా ఈయనే. బాబ్ హెయిర్ కట్ తో జర్నలిస్ట్ గా ఇంతకు ముందు చేయని పాత్రలో సమంతా లుక్ ఇప్పటికే వైరల్ అయ్యింది. పైన చెప్పిన మూడు సినిమాలతో ఏ మాత్రం సంబంధం లేని జానర్ తో రూపొందుతున్న ఈ మూవీలో మరో విశేషం కూడా ఉంది. ఆదిపినిశెట్టి ఇందులో ఒక  కీలక పాత్ర పోషిస్తున్నాడు. రంగస్థలంలో ఆదికి తమ్ముడి భార్య రామలక్ష్మిగా నటించిన సమంతా ఈసారి ఓ కేసు ఇన్వెస్టిగేషన్ లో తనకు సహాయపడే పోలీసు పాత్రలో ఆదితో మారోసారి నటిస్తోంది. యుటర్న్ లో కీలక పాత్రలు ఈ రెండే. అంటే రంగస్థలంలో కంటే ఇందులో స్పాన్ ఎక్కువగా దొరుకుతుంది.

ఆదిపినిశెట్టి విలన్ గా  సపోర్టింగ్ యాక్టర్ గా మంచి విజయాలు సాధించాడు కానీ సోలో హీరోగా  తెలుగులో దక్కిన సక్సెస్ మాత్రం లేదు. అది యు టర్న్ తీరుస్తుందో లేదో చూడాలి. అయినా యు టర్న్ కూడా ఒక లేడీ జర్నలిస్ట్ చుట్టూ తిరిగే కథ. ఆది పాత్ర కీలకమే అయినప్పటికీ హీరో అనలేని తరహాలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆది పినిశెట్టి కోరుకుంటున్న సక్సెస్ ఇది ఇచ్చినా తన మీదే ఆధారపడి విజయం సాధించే సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు ఆది. యుటర్న్ హిట్ అయినా తనకు  ప్లస్సే. మరో సక్సెస్ ఆది  ఖాతాలో పడుతుంది.
Tags:    
  • Samantha 
  • Adi 
  • Acterss Samantha 
  • Telguu News 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS