• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంతా భుజాలపై పెద్ద భారం

సమంతా భుజాలపై పెద్ద భారం

By - Tupaki Desk
Update: 2018-09-12 05:37 GMT
రేపు విడుదల కాబోతున్న చైతు సామ్ ల సినిమాలు శైలజారెడ్డి అల్లుడు-యుటర్న్ ల కోసం ట్రేడ్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గీత గోవిందం తర్వాత కాస్త చెప్పుకోదగ్గ స్టార్లు ఉండి కమర్షియల్ గా  బాక్స్ ఆఫీస్ వద్ద మెప్పించిన భారీ సినిమా ఏదీ లేదు. అందుకే వీటి మీద హైప్ బాగా ఉంది. శైలజారెడ్డి అల్లుడులో ఆకర్షణలకు కొదవ లేదు కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ థ్రిల్లర్ జానర్ లో  కేవలం సమంతా ఇమేజ్ ని ఆధారం చేసుకుని మార్కెట్ చేస్తున్న యుటర్న్ కు మాత్రం ఇది అంత తేలిక కాదు. థియేట్రికల్ రైట్స్ ని సుమారు 15 కోట్ల దాకా అమ్మారని సమాచారం. ఇందులో ఓ ఐదారు కోట్లు తమిళ్ వెర్షన్ కు వేసుకున్నా తెలుగు నుంచే 9 కోట్లకు పైగా షేర్ వస్తేనే యుటర్న్ హిట్ గా పరిగణించబడుతుంది. బడ్జెట్ మూవీనే అయినప్పటికీ బాగానే వ్యయం చేసారని తెలిసింది. అందులోనూ  థ్రిల్లర్ జానర్ కాబట్టి సహజంగా మాస్ ఆడియన్స్ దీని వైపు చూసే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ఇక సామ్ కు రెండు వైపులా రిస్క్ పొంచి ఉంది. ఇక్కడేమో భర్త నాగ చైతన్య మాస్ అవతారంలో శైలజారెడ్డి అల్లుడిగా జనాల దృష్టిని ఆకర్షిస్తుంటే మరోవైపు తమిళ్ లో శివకార్తికేయన్ సరసన తనే నటించిన సీమరాజా సైతం ఇలాంటి పోటీనే తెచ్చిపెట్టింది. అది ఫక్తు మాస్ మసాలా డ్రామా. సిమ్రాన్ నెగటివ్ పాత్రలో కీర్తి సురేష్ ఒక స్పెషల్ సాంగ్ చేసిన సీమ రాజా కనక స్ట్రాంగ్ గా నిలబడితే యుటర్న్ కష్టపడాల్సి ఉంటుంది. ఇలా సమంతా ఒకేసారి రెండు చేతులతో వేర్వేరు కత్తులు పట్టుకుని బాక్స్ ఆఫీస్ యుద్ధం చేయాల్సి వస్తోంది. మనవైపు సైతం శైలజారెడ్డి అల్లుడు మీద ఉన్నంత ఉత్సాహంగా యుటర్న్ విషయంలో ట్రేడ్ ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ సమీకరణాలు అన్ని దాటుకుని సమంతా కనక  9 కోట్లు దాటించిన చాలు సూపర్ హిట్ ముద్ర పడిపోతుంది. మరి సామ్ వల్ల ఇది అయ్యే పనేనా కాదా అనేది రేపు ఈ సమయానికి తేలిపోతుంది. లెట్ వెయిట్ అండ్ సీ.
Tags:    
  • Samantha 
  • U Turn 
  • Seema Raja 
  • Box Office 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS