శూర్పణఖ: కాజల్ అవుట్ సమంతా ఇన్..?

Update: 2018-10-16 08:21 GMT
యానిమేషన్ డైరెక్టర్ గా అవార్డులు గెలుచుకున్న భార్గవ్ తాజాగా రాక్షస యువరాణి శూర్పణఖ ప్రధాన పాత్రలో ఒక పౌరాణిక సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.  ఈ సినిమాలో శూర్పణఖ పాత్రకు కాజల్ అగర్వాల్ ను తీసుకుందామని భావించాడట.  కానీ ఆమె ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో వేరే హీరోయిన్ ను వెతక్క తప్పలేదట.  

దీంతో ఆ పాత్ర కోసం సమంతాను సంప్రదించాడట... సామ్ కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్  చూపించిందట.  రావణాసురుడి చెల్లి పాత్ర కావడంతో తనకు డిఫరెంట్ గా ఉంటుందని భావిస్తోందట.  త్వరలో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమేనని అంటున్నారు.  సమంతా ఇప్పటికే 'U టర్న్' లాంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లకు పచ్చజెండా ఊపడం మొదలు పెట్టింది.  ఇక ఈ సినిమా కూడా తన పాత్ర చుట్టూ తిరిగేదే కావడంతో సామ్ మరో సారి లీడ్ రోల్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోందని సమాచారం.

రావణాసురుడి చెల్లిగా శూర్పణఖ పేరు అందరికీ పరిచయమే. శూర్పణఖ రాముడిని ప్రేమించడం.. అయన 'నో' చెప్పడం.. లక్ష్మణుడు సీన్ లో కి ఎంట్రీ ఇవ్వడం.. ఆమె ముక్కు  చెవులను కోయడం అందరికీ తెలిసిన కథ.  మరి ఈ కథతోనే స్టొరీ ఉంటుందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాలి.
Tags:    

Similar News