'ఆహా' కోసం అక్కినేని వారి కోడలు..?
కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ బాగా పుంజుకున్నాయి. కరోనా డేస్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశ్యంతో అప్పటికే సత్తా చాటుతున్న ఓటీటీ దిగ్గజాలకు పోటీగా కొత్తగా మరిన్ని ఓటీటీలు పుట్టుకొచ్చాయి. థియేటర్స్ మూతబడటంతో ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ మూవీస్ - వెబ్ సిరీస్ లు చూస్తున్నారు. దీనికి తోడు కొత్త సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ అవుతుండటంతో ఓటీటీల హడావిడి ఇంకాస్త ఎక్కువైంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఓటీటీల ప్రభావాన్ని ముందే ఊహించిన టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 'ఆహా' పేరుతో వంద శాతం తెలుగు యాప్ ని క్రియేట్ చేశారు. తెలుగు డబ్బింగ్ సినిమాలు.. వెబ్ సిరీస్ లతో పాటు కొత్త సినిమాలను కూడా స్ట్రీమింగ్ కి పెడుతూ ప్రముఖ ఓటీటీలకు పోటీగా నిలుస్తోంది. ఈ క్రమంలో 'ఆహా' కు మరింత క్రేజ్ ని తీసుకురావడం కోసం అక్కినేని సమంత ను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది.
'ఆహా' లో ఈ మధ్య డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలైన 'భానుమతి రామకృష్ణ' 'కృష్ణ అండ్ హిజ్ లీల' 'ఓరేయ్ బుజ్జిగా' 'కలర్ ఫోటో' వంటి సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. ఈ మధ్య కమెడియన్ హర్ష తో, యాంకర్ సుమ కనకాలతో టాక్ షో లు కూడా చేస్తున్నారు. 'ఆహా' లో వచ్చే కంటెంట్ కి భారీగా ప్రమోషన్స్ చేస్తున్న నిర్వాహకులు.. ప్రమోషన్స్ కోసం ఏకంగా దక్షిణాది అగ్ర కథానాయిక సమంత ని రంగంలోకి దిగితున్నారట. అక్కినేని వారి కోడలితో ఓ టాక్ షోను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. తాజాగా 'ఆహా' రిలీజ్ చేసిన టీజర్ ప్రోమో ఈ షో కి సంబంధించిందే అని టాక్. ఈ ప్రోమోలో సమంత ని చూపించకుండా 'ఆ నుండి ఆహా.. అనిపించింది ఎవరు?' అంటూ సస్పెన్స్ మెయిన్టైన్ చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. కాగా, సమంత అక్కినేని మ్యారీడ్ లైఫ్ ని కెరీర్ ని బ్యాలన్స్ చేసుకుంటూ వస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. సమంత డెబ్యూ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.