సమంతకి ఆ 'ఎన్' బాగా క్లోజ్

Update: 2016-05-25 13:30 GMT
సౌత్ బ్యూటీ సమంత ఈ సమ్మర్ లో వరుసగా భారీ చిత్రాలతో వార్తల్లో నిలుస్తోంది. విజయ్ తెరితో మొదలుపెట్టి, సూర్య 24 - మహేష్ బ్రహ్మోత్సవం - జూన్ 2న నితిన్ తో చేస్తున్న త్రివిక్రమ్ అ..ఆ.. ఇలా వరుసగా పెద్ద బడ్జెట్ సినిమాల్లో సమంతనే హీరోయిన్. వీటి ప్రచారాల్లో కూడా యాక్టివ్ గా పాల్గొంటూ ఉండడంతో.. టాలీవుడ్ - కోలీవుడ్ లలో సమంత పేరు మార్మోగిపోతోంది. ఇటు సినిమాలతో పాటు అటు పర్సనల్ విషయాలను తన అభిమానులతో సమంత షేర్ చేసుకుంటోంది.

ఈ మధ్యనే తన లవర్ - పెళ్లి గురించి కామెంట్స్ చేయడం.. పేరు చెప్పకుండా యంగ్ హీరో అనడంతో.. ఊహాగానాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు రీసెంట్ గా మరో ట్వీట్ చేసింది సమంత. 'నాకు బాగా నచ్చినవి ఇవే.. నా ఎన్ లాకెట్ - నా చిన్న ఫ్లాట్లు - నా బకెట్ బ్యాగ్ - ఒక గొప్పపుస్తకం' అంటూ వాటి ఫోటోలను కూడా ట్వీట్ చేసింది. ఈ ఎన్ లాకెట్ ని గతంలో రెగ్యులర్ గా వేసుకుని కనిపించేది సమంత. దానిపై క్వశ్చన్స్ ఎక్కువైపోవడంతో పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్లీ కొన్ని నెలల్లోనే నా లవర్ పేరు చెబుతా అనే ట్వీట్ తర్వాత.. ఎన్ లాకెట్ సంగతి చెప్పడంతో.. మరోమారు ఆ ఎన్ ఎవరా అనే క్వశ్చన్ బయల్దేరింది.

టాలీవుడ్ లో ఎన్ అక్షరంతో మొదలై.. సమంతతో ఎక్కువగా సినిమాలు చేసిన యంగ్ హీరో ఎవరో అందరికీ తెలుసు. మరి ఇలా మాటిమాటికీ ఊరించేటపుడు.. రెండు రోజుల క్రితం.. 'నా పెళ్లి గురించి నేను చెప్పేవరకూ అడగద్దు' అనే ట్వీట్ ఎందుకో సమంతకే తెలియాలి.
Tags:    

Similar News