సిజ్లింగ్ పోస్టర్: 'పుష్ప' ఐటమ్ సాంగ్ లో సమంత హాట్ హాట్ స్టెప్పులు..!

Update: 2021-11-30 14:30 GMT
అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ''పుష్ప''. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరు 17న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న చిత్ర బృందం.. చివరి పాట చిత్రీకరణలో బిజీగా వుంది.

'పుష్ప: ది రైజ్' సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఓ స్పెషల్ సాంగ్ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ ఐటమ్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ స్పెషల్ నంబర్ లో బన్నీ - సామ్ స్టెప్పులు ప్రత్యేకంగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా 'పుష్ప' మేకర్స్ సమంత చేస్తున్న ప్రత్యేక గీతానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సమంత రూత్ ప్రభు కలసి చేస్తున్న రాకింగ్ నంబర్‌ ను భారీ సెట్‌ లో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. త్వరలో ఈ 'సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్' ని చూడటానికి సిద్ధంగా ఉండండని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఇందులో సమంత ఫేస్ కనిపించనప్పటికీ.. నడుము మీద చెయ్యేసి వయ్యారాలు పోతున్న పోజ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సిజ్లింగ్ పోస్టర్ చూసి సినిమాలో ఐటమ్ సాంగ్ ఎలా ఉంటుందో ఓ అంచనాకు వస్తున్నారు. అసలే పుష్పరాజ్ ఊర మాస్. ఇప్పుడు ఆయనకు ఏమాత్రం తగ్గినంటూ సామ్ జత కలుస్తోంది. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించిన సామ్.. ఇప్పుడు 'పుష్ప: ది రైజ్' లో స్పెషల్ నంబర్ లో ఎలా ఆడిపాడుతుందో చూడాలి.

కాగా, 'పుష్ప' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న చిత్రమిది. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ - సునీల్ - అనసూయ - ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. డిసెంబరు 6న 'పుష్ప: ది రైజ్' ట్రైలర్ విడుదల కానుంది.
Tags:    

Similar News