అక్కినేనివారి కోడలు ఏటో వెళ్లిపోయింది..?

Update: 2020-04-07 07:30 GMT
అక్కినేని సమంత.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అక్కినేని ఇంటి కోడలైన తర్వాత ఈమె కెరీర్ మూడు హిట్లు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఇంకోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసే విధానం చూసి మిగతా ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఈ భామ ఒక ఇంగ్లీష్ పత్రిక నిర్వహించే పోల్‌లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ అవార్డులపై కొన్ని విమర్శలు వచ్చినా.. నిజంగానే సమంత మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అనే చెప్పాలి. ఈ ఏడాది దిల్ రాజు నిర్మాణంలో చేసిన ‘జాను’తో పలకరించింది. సోషల్‌ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా వుండే దక్షిణాది తారల్లో సమంత ఒకరు. ట్విట్టర్‌ లో 7.9 మిలియన్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లో 9.5 మిలియన్స్‌ ఫాలోవర్స్‌ వున్న సమంత గత కొద్ది రోజులుగా తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ లో ఎటువంటి పోస్ట్‌లు చేయకపోవడం విశేషం.

కరోనా వ్యాప్తి, లాకౌట్‌ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తమ ఖాతాలో పలు సందేశాలను పోస్ట్‌ చేస్తున్నారు. కానీ సమంత గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియాలో ఎటువంటి పోస్ట్‌లు పెట్టలేదు. తన పెట్ డాగ్, భర్త నాగ చైతన్య తో ఉన్న పిక్ ఒకటి పోస్ట్ చేసింది. గత పదిరోజుల క్రిత తన భర్త నాగచైతన్య కరోనా మహామ్మరి నిరోధానికి విరాళం ప్రకటించినప్పుడు మాత్రమే నాగచైతన్య పెట్టిన పోస్ట్‌ను రీపోస్ట్‌ చేసింది. ఆ తరువాత సమంత సోషల్‌మీడియాలో ఎటువంటి పోస్ట్‌లు పెట్టలేదు.. సమంత సైలెంట్‌ వెనుక కారణమేమిటని ఆమె అభిమానులు ఆందోళనలో వున్నారు. మొన్న మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అందతు కాండిల్ తో 9 పీఎం 9 మినిట్స్ లో కూడా పాల్గొన్నట్లు సమాచారం ఇవ్వలేదు. ఇది తుపాను ముందుండే నిశబ్ధమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే సమంత దగ్గరి వాళ్ళ సమాచారం మేరకు సమంత తన బిజినెస్ పనుల్లో బిజీగా ఉందని సమాచారం. ఇప్పటికే 'ఏకం' అనే ప్లే స్కూల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో క్రేజ్ కోల్పోయిన 'ఏకం'ను దారిలోపెట్టే పనిలో పడిందట సమంత. అంతేకాకుండా కొన్ని రోజుల్లో న్యూ మూవీ అప్డేట్ తో ముందుకు రాబోతోందని సమాచారం.
Tags:    

Similar News