కాంట్రవర్సి ప్రశ్నలకు శ్రీ విష్ణు, రధన్ ఏమన్నారంటే..

టాలీవుడ్ లో ఒక డిఫరెంట్ ట్రెండ్ లో సినిమాలు చేసే అతికొద్ది మంది యువ హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు.;

Update: 2026-02-19 05:22 GMT

టాలీవుడ్ లో ఒక డిఫరెంట్ ట్రెండ్ లో సినిమాలు చేసే అతికొద్ది మంది యువ హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. వెరైటీ కాన్సెప్ట్‌లుతో కామెడీ టైమింగ్ పక్కాగా ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు అతని నుంచి రాబోతున్న కొత్త సినిమా 'విష్ణు విన్యాసం' మీద అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్గా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇక ఈసారి కూడా ఒక క్రేజీ ఎంటర్టైనర్ గ్యారెంటీ అనిపిస్తోంది. వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న శ్రీవిష్ణు, ఇందులో జాతకాలను అతిగా నమ్మే క్యారెక్టర్‌లో నవ్వించబోతున్నాడు.

ఈవెంట్‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ షేర్ చేశారు. టీజర్‌లో వచ్చే కొన్ని డైలాగులు చూసి "ఏంటి ఇంత పవిత్రమైన పేరు పెట్టి ఇలాంటి మాటలు వాడారు?" అని అడిగిన ప్రశ్నకి అతను తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. అంత పద్ధతిగా ఉండే బుద్ధిమంతుడైన కుర్రాడితో కూడా అలాంటి మాటలు చెప్పించిందంటే, సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఎంత 'శివంగి'లా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని, అది థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయమని చెప్పారు.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న రథన్ గారి గురించి కూడా ఈవెంట్‌లో ఒక చర్చ జరిగింది. జర్నలిస్టులు అతని గురువు ఏఆర్ రెహమాన్ గారు రీసెంట్గా చేసిన కామెంట్స్ గురించి, అలాగే ఇండస్ట్రీలో ఉన్న పార్షియాలిటీ గురించి అడిగారు. దానికి రథన్ చాలా హుందాగా స్పందించారు. తన గురువు గారి వ్యక్తిగత విషయాల గురించి తను మాట్లాడనని, తన వరకు మాత్రం తన టాలెంట్‌ని నమ్మి ఛాన్స్ ఇచ్చిన శ్రీవిష్ణు, డైరెక్టర్ మారుతి గారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు.

రథన్ అర్జున్ రెడ్డి తరువాత తన గురించి వస్తున్న కొన్ని రూమర్లపై కూడా క్లారిటీ ఇచ్చారు. తను ఆస్ట్రేలియా నుండి వచ్చానని, సంవత్సరానికి ఒక్క సినిమానే చేస్తానని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. మ్యూజిక్ మీద ఉన్న ప్యాషన్‌తోనే ఇక్కడికి వచ్చానని, తనని ఆదరించిన తెలుగు పరిశ్రమ తనకు అమ్మ లాంటిదని ఎమోషనల్ అయ్యారు. తన భార్య కూడా తెలుగు అమ్మాయేనని, తన మ్యూజిక్‌ని నమ్మి ఎవరు పిలిచినా వర్క్ చేయడానికి తను ఎప్పుడూ రెడీ అని చాలా సింపుల్‌గా చెప్పారు.

ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడీగా నయన సారిక నటిస్తోంది. టీజర్ చూస్తుంటే వీరిద్దరి మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్ చాలా వెరైటీగా ఉంటుందని అర్థమవుతోంది. ఒక పక్క హీరోతో ప్రేమలో ఉంటూనే, మరో పక్క అతనికే పెళ్లి సంబంధాలు చూడమని చెప్పే హీరోయిన్ క్యారెక్టర్ సినిమాలో మెయిన్ హైలైట్ అవ్వబోతోంది. యదునాథ్ మారుతీ రావు ఈ కథను నేటి తరం ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చాలా ఫ్రెష్‌గా డీల్ చేశారని మేకర్స్ తెలిపారు. ఇక 'విష్ణు విన్యాసం' టీజర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ని క్రియేట్ చేసింది. సుమంత్ నాయుడు గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 28న థియేటర్లలోకి రానుంది.

Tags:    

Similar News