శ్రీ‌విష్ణు సూప‌ర్ హిట్ మూవీకి సీక్వెల్!

ఓ సినిమా స‌క్సెస్ అయిందంటే దానికి మేక‌ర్స్‌, హీరోలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఆ హిట్‌ని క్యారీ ఫార్వ‌ర్డ్ చేస్తూ మ‌రో స‌క్సెస్ ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నారు.;

Update: 2026-02-19 04:33 GMT

ఓ సినిమా స‌క్సెస్ అయిందంటే దానికి మేక‌ర్స్‌, హీరోలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఆ హిట్‌ని క్యారీ ఫార్వ‌ర్డ్ చేస్తూ మ‌రో స‌క్సెస్ ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నారు. హిట్ సినిమాల‌కు సీక్వెల్స్‌, పార్ట్ 2..పార్ట్ 3 అంటూ అదే క‌థ‌ల‌ని కంటిన్యూ చేస్తూ వ‌రుస స‌క్సెస్‌ల‌ని త‌మ ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ త‌ర‌హా సినిమాల‌కు ప్రేక్ష‌కుల కూడా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ చాలా వ‌ర‌కు హిట్ సినిమాల‌కు సీక్వెల్స్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు క్రేజీ సినిమాల‌కు సీక్వెల్స్ రానున్న నేప‌థ్యంలో మ‌రో సూప‌ర్ హిట్ మూవీకి కూడా సీక్వెల్ రాబోతోంది.

వ‌రుస హిట్‌ల‌తో కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనిపించుకుంటున్న శ్రీ‌విష్ణు ప్ర‌స్తుతం రెండు విభిన్న నేప‌థ్య సినిమాల్లో న‌టిస్తున్నాడు. యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా `మృత్యుంజ‌య్‌`, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా సాగే `విష్ణు విన్యాసం` చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో `మృత్యుంజ‌య్‌` ఫిబ్ర‌వ‌రి 27న రిలీజ్‌కు రెడీ అవుతుండ‌గా, శ్రీ‌విష్ణు మార్కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ నేప‌థ్యంలో రూపొందిన `విష్ణు విన్యాసం` ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌ల కాబోతోంది.

ఇప్ప‌టికే విడుద‌లైన ఈ రెండు సినిమాల ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకేసారి రెండు భిన్న‌మైన జోన‌ర్ సినిమాలతో శ్రీ‌విష్ణు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. దీంతో ఈ రెండు సినిమాలు స‌క్సెస్ అవుతాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు బ‌లంగా చెబుతున్నాయి. ఇదిలా ఉంటే గ‌త ఏడాది శ్రీ‌విష్ణు రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ `సింగిల్‌` మంచి విజ‌యాన్ని సాధించి హీరోగా శ్రీ‌విష్ణుకు మంచి పేరు తెచ్చి పెట్టింది. కేతిక శ‌ర్మ‌, ఇవానా హీరోయిన్‌లుగా న‌టించిన ఈ మూవీఎండింగ్‌లో శ్రీ‌విష్ణు సింగిల్‌గా మిగిలిపోవ‌డం.. ఆ త‌రువాత వ‌చ్చే స‌న్నివేశాల‌తో సీక్వెల్‌కు ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు ప్ర‌స్తుతం దీనికి సీక్వెల్ చేసే ప‌ని మొద‌లు పెట్టాడు.

త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని హీరో శ్రీ‌విష్ణు స్పష్టం చేశారు. దీంతో కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ శ్రీ‌విష్ణు సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియ‌న్స్ ఖుషీ అవుతున్నారు. సీక్వెల్‌లో హీరోయిన్స్ మారే అవ‌కాశం ఉంది. `సింగిల్‌`లో న‌టించిన కేతిక‌శ‌ర్మ పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన‌ట్టుగా, ఇవానా కాబోయే వాడితో సెటిల్ అయిన‌ట్టుగా చూపించారు. దీంతో సీక్వెల్‌లో మ‌రో ఇద్ద‌రు హీరోయిన్‌ల‌ని దించేసే అవ‌కాశం ఉంది. వాళ్లు ఎవ‌రు? ఏంటీ అన్న‌ది త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానుంది.

Tags:    

Similar News