సమంత ఏంటీ దేవదాస్ లా అయ్యింది?
సమంత అక్కినేని వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకుల గురించి తెలిసిందే. నాగచైతన్య నుంచి విడిపోయిన అనంతరం సింగిల్ స్టాటస్ లో తనకి సాంత్వన ఎలా? అంటే.. ఒకటి కెరీర్ పరంగా బిజీ అవ్వడం.. రెండోది స్నేహితులు బంధుమిత్రులతో విహారయాత్రలు.. మూడోది ఇలా పెట్స్ తో నిరంతరం ఆటలాడుకోవడం ఫన్ ని ఎంజాయ్ చేయడం తనకు ఎంతో రిజనవేషన్ ని ఇస్తున్నాయి.
తాజాగా సమంత రూత్ ప్రభు షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో జెట్ స్పీడ్ తో వైరల్ అవుతోంది. సమంత ఈ ఫోటోలో కుక్కలతో సేదతీరుతోంది. తన పెంపుడు కుక్కలు హాష్- సాషాతో కలిసి క్రిస్మస్ సందర్భంగా తన విలువైన సమయాన్ని వెచ్చిస్తోంది. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత ఆమెకు ఇదే మొదటి క్రిస్మస్.
ఈసారి తనకు హాష్ - సాషానే గొప్ప కంపానియన్ అని ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది. హైదరాబాద్ లోని తన ఇంట్లో పెంపుడు కుక్కలతో కలిసి సామ్ ఇలా ప్రత్యక్షమైంది. డిసెంబర్ 19న తన లైఫ్ ఎలా ఉందో ఇన్ స్టాలో ఇలా వెల్లడించింది. ఒక వీడియోను కూడా సామ్ షేర్ చేసింది. అందులో ఆమె లాస్ట్ క్రిస్మస్ నేను మీకు నా హృదయ గీతాన్ని అందించాను... అని ఆవేదనను వెలిబుచ్చింది.
సమంత చివరిసారిగా అల్లు అర్జున్ `పుష్ప: ది రైజ్`లో `ఊ అంటావా..` (తమిళంలో ఓ సోల్రియా) అనే ప్రత్యేక పాటలో కనిపించింది. ఇది పెళ్లి తర్వాత ఇటీవలి వివాదం అనంతరం కెరీర్ లో తొలి ప్రత్యేక గీతం. తదుపరి గుణశేఖర్ శాకుంతలం.. విఘ్నేష్ శివన్ `కాతువాకుల రెండు కాదల్` విడుదలల కోసం సమంత వేచి ఉంది. అలాగే తొలి విదేశీ చిత్రం `అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్` సహా మూడు సినిమాలకు సంతకాలు చేసింది. యశోద .. దర్శకుడు శాంతరూబన్ లతో ఇంకా టైటిల్ నిర్ణయించని చిత్రం చేస్తోంది.

అక్టోబరు 2న చై-సామ్ జంట విభేదాల కారణంగా నాలుగేళ్ల వివాహబంధాన్ని ముగించారు. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 19న సమంత తన పెంపుడు కుక్కలతో క్రిస్మస్ పాటలు వింటున్న ఫోటోలు .. వీడియోను షేర్ చేసింది.
ఆ రెండు పెట్స్ తోనే సామ్ సంభాషిస్తోంది. ఇలా ఒంటరిగా దేవదాస్ లా మారింది... అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె క్రిస్మస్ చెట్టు ఎమోజితో పోస్ట్ ను షేర్ చేయడంతో ఈసారి సెలబ్రేషన్ తన పప్పీస్ తోనే అని అర్థమైంది.