• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత గట్స్‌కు హ్యాట్సాఫ్...

సమంత గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

By - Tupaki Desk
Update: 2017-10-13 14:05 GMT
‘రాజు గారి గది-2’లో చేసిన అమృత పాత్రే ఇప్పటిదాకా సమంత కెరీర్లో బెస్ట్ రోల్ అని ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో తేల్చేశాడు అక్కినేని నాగార్జున. సమంత సైతం ఈ పాత్ర గురించి చాలా గొప్పగా చెప్పుకుంది. ఈ పాత్రకు సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాల్లో తాను గ్లిజరినే వాడలేదని.. ఓన్ చేసుకుని - ఫీలై నటించానని ఆమె చెప్పింది. మరి అంత గొప్పగా చెప్పుకున్న ఈ పాత్రలో ఏమంత విశేషం ఉందా అని ఆసక్తిగా ‘రాజు గారి గది-2’ సినిమా చూశారు ప్రేక్షకులు. ఐతే మామా కోడళ్లు చెప్పిన స్థాయిలో కాకపోయినా.. సమంత కెరీర్లో ఈ అమృత పాత్ర ప్రత్యేకం అనడంలో మాత్రం సందేహం లేదు.

బాత్రూంలో స్నానం చేస్తున్నపుడు ఎవరో వీడియో తీస్తే.. అది బయటికి రావడంతో అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పాత్రలో నటించింది సమంత. దానికి సంబంధించిన సన్నివేశంలో సమంత నగ్నంగా ఉన్నట్లు చూపించి బ్లర్ చేస్తారు. అక్కడ సమంత నగ్నంగా ఏమీ కనిపించకపోయినా.. అలా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఇలాంటి పాత్రను ఒక స్టార్ హీరోయిన్ చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయమే. బహిరంగంగా చర్చించడానికి ఎవరూ ఇష్టపడని, చర్చించని విషయాల్ని ‘రాజు గారి గది-2’లో చూపించారు. సమంత పాత్ర కూడా అందులో భాగమే. ఓ మోస్తరు స్థాయి ఉన్న ఏ హీరోయిన్ కూడా ఇలాంటి పాత్ర చేయడానికి అంగీకరించకపోవచ్చు. అందులోనూ పెళ్లి సెటిలయ్యాక ఓ పెద్ద ఫ్యామిలీలోకి వెళ్తూ ఇలాంటి పాత్రను ఒప్పుకోవడమూ సాహసమే. ఈ పాత్ర సమంత చేయడానికి చైతూ - నాగ్ పచ్చజెండా ఊపడమూ గొప్ప విషయమే. మొత్తానికి సమంత చేసిన సాహసానికి మంచి ఫలితమే వచ్చేలా ఉంది. ‘రాజు గారి గది-2’ చూసిన వాళ్లందరూ సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Tags:    
  • Samantha 
  • Raju Gari Gadhi 2 Movie 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS