స‌మంత ఎన్నో నిజాలు చెప్పేసింది

Update: 2015-10-24 05:20 GMT
మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రు?  మీ ఫేవ‌రెట్ హీరో ఎవ‌రు?  ఫేవ‌రెట్ హీరోయిన్ ఎవ‌రు? ఇలాంటి ప్ర‌శ్న‌లు వేస్తే స‌మాధానం వ‌స్తుందా?  కానీ స‌మంత వీట‌న్నిటికీ ఏ మొహ‌మాటం లేకుండా స‌మాధానాలు చెప్పింది.

టాలీవుడ్ డైరెక్ట‌ర్ కం రైట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ నాకు బెస్ట్ ఫ్రెండ్‌. నా ఫేవ‌రెట్ హీరో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌. నా ఫేవ‌రెట్ హీరోయిన్ త్రిష అంటూ ప్ర‌తి విష‌యాన్ని ఓపెన్‌ గా చెప్పింది. విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తున్న విజ‌య్ 59లో ఓ ఇంట్రెస్టింగ్ రోల్ లో చేశాను. ఈ సినిమా నా కెరీర్‌ లో ప్ర‌త్యేకం అని చెప్పింది. విక్ర‌మ్ స‌ర‌స‌న న‌టించిన 10 ఎంద్రాతుకుళ్ల చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి క‌దా? అన్న ప్ర‌శ్న‌కు .. అవును. కానీ ఇందులో నా క్యారెక్ట‌ర్ చాలా స్పెష‌ల్‌. కాస్త నెగెటివ్ ట‌చ్ ఇచ్చారు. ట్రైబ‌ల్ నాయ‌కురాలిగా నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్ట‌ర్ చేసినా, బోలెడంత ఫ‌న్ వ‌ర్క‌వుటైంది అంటూ చెప్పుకొచ్చింది స‌మంత‌.

ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో ఏం మాట్లాడినా నిజాలే మాట్లాడేస్తోంది. హీరో సిద్ధార్థ్ గురించిన నిజాలు త‌ప్ప‌. బ్రేకప్‌ మాత్రం పర్సనల్‌ ఎఫైర్‌ అంటోంది.. అసలు అలాంటి క్వశ్చన్లను దరికి చేరనివ్వలేదులే.

Tags:    

Similar News