సమంత టాలీవుడ్ కు మొహం చాటేయనుందా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నట్లుగా ప్రకటించింది. నాగ చైతన్య మరియు సమంతలు ఇద్దరు సుదీర్ఘంగా చర్చించుకుని.. ఇద్దరి దారులు వేరు వేరు అని ఎవరి దారిలో వాళ్లం నడవాలనే ఉద్దేశ్యంతో విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఈ ఇద్దరిలో తప్పు ఎవరిది విడాకులకు కారణం ఎవరు అనే విషయాలను విశ్లేషించేందుకు జనాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు. భార్య భర్తలు ఎవరు విడాకులు తీసుకున్నా కూడా భారత సమాజంలో ఆడవారిపైనే తప్పు నెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. అదే ఇప్పుడు జరుగుతుంది. తెలుగు ప్రేక్షకులు ఎక్కువ శాతం మంది విడాకులకు ప్రథాన కారణం సమంత అన్నట్లుగా భావనకు వచ్చేశారు. సమంత మరియు నాగ చైతన్యల్లో చైతూ చాలా ఇన్నోసెంట్. అతడి వల్ల సమస్య వచ్చి ఉంటుంది అంటే ఎవరు నమ్మడం లేదు. ఆమె ఈగోకు వెళ్లి విడాకుల వరకు వెళ్లినట్లుగా విమర్శలు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. తెలుగు వారిలో సమంతపై నెగిటివిటీ చాలా ఉంది. కనుక ఆమె మళ్లీ తెలుగులో నటించే అవకాశాలు ఉన్నాయా అనేది చాలా మంది చర్చించుకుంటున్న మాట.
సమంత సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ అన్నట్లుగా అభిమానులు మరియు ప్రేక్షకులు భావించే వారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా మంది సమంత సినిమాలపై ఆసక్తి చూపడం లేదు. ఆమె తెలుగు సినిమాలో మళ్లీ నటిస్తే ఆధరించే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే నటించిన శాకుంతలం సినిమా విడుదల సమయంలో పరిస్థితి ఏంటా అంటూ మేకర్స్ కాస్త టెన్షన్ గా ఉన్నారట. సినిమా మంచి కంటెంట్ తో రూపొందడంతో పాటు ప్రముఖులు మేకింగ్ లో ఉన్నారు కనుక ఖచ్చితంగా శాకుంతలం సినిమా తెలుగు లో మంచి రిలీజ్ అవ్వడం ఖాయం. విడాకులతో సంబంధం లేకుండా శాకుంతలం సినిమా నడుస్తుందనే నమ్మకం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాని హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తే మాత్రం సమంతను ట్రోల్ చేసేందుకు నెటిజన్స్ సిద్దంగా ఉంటారు అనేది టాక్.
తెలుగు లో ఆఫర్లు విషయంలో అనుమానాలు ఉన్నాయి.. తమిళంలో నటించేందుకు సమంత సిద్దంగా ఉన్నా అక్కడ ఏ మేరకు ఆఫర్లు వస్తాయి అనేది తెలియడం లేదు. అందుకే ఈమె బాలీవుడ్ కు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. టాలీవుడ్ కు మెల్ల మెల్లగా మొహం చాటేసి బాలీవుడ్ లో బిజీ అవ్వాలని ఈమె భావిస్తుండట. ఇప్పటికే అక్కడ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపును దక్కించుకుంది. సమంత ఓకే అనాలే కాని చిన్న సినిమాలు మీడియం సినిమాలు వరుసగా ఆమె ముందు క్యూ కడతాయి. అలా ఆమె బాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ ధీమాతోనే బాలీవుడ్ లో సమంత ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉందనే వార్తలు వస్తున్నాయి. మంచి అందంతో పాటు నటన ప్రతిభ ఉన్న సమంత ముందు ముందు మరింతగా బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.