థ్యాంక్స్ చెప్పిన కంగనా.. క్వీన్‌ అంటూ సమంత సమాధానం

Update: 2021-04-03 03:31 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ హీరోయిన్ గా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ 'తలైవి' రూపొందుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా ఈ సినిమా నుండి ఒక పాట విడుదల అయ్యింది. ఆ పాటను మూడు భాషల్లో కూడా టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత లాంచ్‌ చేసింది. ట్విట్టర్ ద్వారా సమంత ఆ పాటను లాంచ్‌ చేసినందుకు గాను కంగనా కృతజ్ఞతలు తెలియజేసింది. ఆ సమయంలోనే సమంత స్త్రీ తత్వ వాదనను గురించి కంగనా ప్రస్తావించింది. మనం ఒకరిని ఒకరు సమర్థించుకుంటూ ప్రోత్సహించుకంఉటూ శక్తివంతం అవ్వాలి అదే నిజమైన స్త్రీ వాదం అంటూ సమంతకు థ్యాంక్స్ చెప్పింది.

కంగనా ట్వీట్ కు సమంత ట్విట్టర్ లో స్పందించింది. కంగనా ట్వీట్ ను రీ ట్వీట్‌ చేసి క్వీన్ అంటూ హ్యాండ్స్ ఈమోజీలను షేర్‌ చేసింది. పాట విడుదల సందర్బంగా అమ్మ యొక్క సాటిలేని  దయాగుణం మరియు కరుణ అందరికి తెలుసు. ఆమె అభిమానులకు ఈ సినిమాతో మంచి కానుక ఇవ్వండి. నేను ఈ సినిమా ను చూడటం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ సమంత ట్వీట్‌ చేసింది. దర్శకుడు విజయ్‌ కి ఇలాంటి సినిమా తీసినందుకు అభినందనలు కూడా తెలియజేసింది. సమంత చేతుల మీదుగా విడుదల అవ్వడం వల్ల పాటకు మంచి పబ్లిసిటీ అయితే దక్కింది. తలైవి సినిమా అన్ని భాషల్లో ఈనెల 23న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Tags:    

Similar News