బన్నీ నటన నిజంగా అద్భుతం.. స్ఫూర్తిదాయకం..!
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ''పుష్ప: ది రైజ్''. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ళు రాబడుతోంది. దీనికి ముఖ్య కారణం హీరో బన్నీ అద్భుతమైన నటన అని ఎవరూ కాదనలేని విషయం.
'పుష్ప' పార్ట్-1 సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని మోసాడు అల్లు అర్జున్. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో పుష్పరాజ్ అనే స్మగ్లర్ గా డీ గ్లామర్ లుక్ లో అదరగొట్టాడు. ఇప్పుడు బన్నీ పెర్ఫార్మన్స్ పై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.
అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా స్టార్ హీరో నటనకు ఫిదా అవుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కూడా 'పుష్ప: ది రైజ్' లో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ కొనియాడింది. ఈ సినిమాలో అతని అసాధారణమైన నటన నుంచి స్ఫూర్తి పొందుతానని పేర్కొంది.
సమంత ఇన్స్టాగ్రామ్ లో 'పుష్ప' సినిమా గురించి పేర్కొంటూ.. ''ఇది అల్లు అర్జున్ పై ప్రశంసల పోస్ట్. ఈ సినిమాలో అతను ప్రతి సెకను మిమ్మల్ని కట్టిపడేసే ప్రదర్శన చేశాడు. ఒక నటుడు అసాధారణమైన ప్రదర్శనతో గొప్ప నటన కనబరిస్తే.. దాన్నుంచి నేను ఎప్పుడూ స్ఫూర్తిని పొందుతాను. 'పుష్ప' లో బన్నీ ఒక భుజం పైకి లేపి ఉంచడం - ఆ యాస మరియు స్వాగ్ కూడా అలాంటివే. ఇది ఖచ్చితంగా అద్భుతమైనది.. నిజంగా స్ఫూర్తిదాయకం'' అని ప్పోస్ట్ చేసారు.
ఇకపోతే ''పుష్ప: ది రైజ్'' సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. 'ఊ అంటావా.. ఊఊ అంటావా' అనే ఈ పాటలో సామ్ రెచ్చిపోయి నటించింది. సోషల్ మీడియాని ఊపేసిన ఈ సాంగ్.. ఇప్పుడు థియేటర్లలో మాస్ ఆడియన్స్ తో స్టెప్పులు వేయిస్తోంది. అయితే సమంత ఈ ప్రత్యేక గీతంలో నర్తించడానికి అంగీకరించలేదని దర్శకుడు సుకుమార్ తెలిపారు.
స్పెషల్ సాంగ్ తనకు సరైనది కాదని సమంత ఆఫర్ రిజెక్ట్ చేసిందని.. మిగతా స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారంటూ ఉదాహరణలుగా చెప్పించి ఒప్పించానని సుకుమార్ చెప్పారు. 'రంగస్థలం' సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ప్రస్తావన తీసుకొచ్చినా కూడా సమంత నో చెప్పిందని.. ఆ తర్వాత తన మాటపై నమ్మకంతో ఓకే చెప్పి ఈ సాంగ్ చేసిందని సుకుమార్ తెలిపారు.