• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'కత్తి'తో సమంత...రిలీజ్...

'కత్తి'తో సమంత...రిలీజ్ ఎప్పుడంటే?

By - Tupaki Desk
Update: 2019-02-22 06:59 GMT
సమంత రూత్ ప్రభు...కాదు కాదు...ఇప్పుడు ఆమె సమంత అక్కినేని....సహజంగా హీరోయిన్స్ అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్న ఫార్ములాతో సేల్ అయిపోతూ ఉంటారు. అయితే అలాంటి హీరోయిన్స్ లో నేను చాలా డిఫరెంట్ అంటుంది సమంతా..అదేలా అంటారా..ఒక్కసారి ఈ మ్యాటర్ పై లుక్ వెయ్యండి. మీకే అర్ధం అవుతుంది. సమంత...చైతు ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సహజంగా పెళ్లి తర్వాత ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఇంటికి పరిమితం అయిపోతుంది...సినిమాల విషయంలో కాస్త వెనకడుగులు వేస్తూ ఉంటారు...కానీ నేను అలా కాదు...సినిమా సినిమానే...పెళ్లి పెళ్ళే అంటుంది మన అందాల భామ సమంత.

ఆమె పెళ్లి తర్వాత అనేక సినిమాల్లో నటించింది. ఒకటి కాదు రెండు కాదు..రంగస్థలం, మహానటి, అభిమన్యుడు...యూటర్న్ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. అలా అని హీరోయిన పాత్రలు కాకుండా, కేవలం సోలో పాత్రలే వేసిందా అంటే లేనే లేదు, రంగస్థలంలోను, అభిమన్యుడు లోను ఆమె హీరోయిన గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో పక్క తన భర్త చైతుతో కలసి మజిలీలో నటిస్తూనే, ఇంకో పక్క 96 లాంటి సినిమాను కూడా ఒకే చేసింది. ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడు సమంత మరో మూవీతో త్వరలోనే అంటే మజిలీ సినిమా రిలీజ్ కి ముందే ప్రేక్షకులను పలకరించనుంది. ఇంతకీ ఏ సినిమా అంటారా...ఆ సినిమా పేరే ‘సూపర్ డీలక్స్'. ఈ సినిమా పాత సినిమా అయితే కాదు, అలా అని కొత్త సినిమా అంటే కాదు అని అనలేం ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యీ చాలా కాలమే అయ్యింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.

అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమాలో సమంత సరికొత్త పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పోస్టర్స్ చూస్తే ఆమె ఏదో మర్డర్ చేస్తున్నట్లు, మటన్ కొట్టే కత్తిని చేతిలో పట్టుకుని ఉంది. అంతేకాదు, తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అయితే తమిళ్ లోను, తెలుగు లోను ఒకే సారి రిలీజ్ చేసే దిశగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాను మార్చి 29న అటు తమిళ్, ఇటు తెలుగు రెండు బాషల్లో రిలీజ్ చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి...మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే, మరో నెల రోజులు ఆగాల్సిందే.
Tags:    
  • Samantha 
  • Super Deluxe Movie 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS