స్ర్కీన్ మీద సమంతకు నచ్చదట
అందాల సమంత కు 10 ఎంద్రాతుకుళ్ల పెద్ద ఝలక్ ఇచ్చింది. ఆ సినిమా ఇచ్చిన ఫలితాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. ఎంతో గొప్పగా నటించిన ఈ సినిమా ఇలాంటి ఫలితాన్ని అందుకుంటుందని అస్సలు ఊహించలేదు అమ్మడు. అయితే పరాజయం గురించి ఆలోచించే టైమ్ లేనంత బిజీగా ఉందిప్పుడు. ఓ వైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో అ..ఆ చిత్రంలో నటిస్తూనే, మరోవైపు బ్రహ్మోత్సవం షూటింగులోనూ బిజీగా గడిపేస్తోంది.
అయితే ఈ బిజీలో ఉండగానే ఏమీ ఊసుపోక ఓ మాట చెప్పింది. అసలు నేను నటించేయడం అంటే నటించేస్తాను .. కానీ నన్ను నేను తెరపై అస్సలు చూసుకోలేను. ఇది నాకు ఉన్న ఓ బ్యాడ్ హాబిట్ అంటూ అసలు గుట్టు బైటపెట్టింది. అసలు అలా చేయడానికి కారణం ఏంటి? అని ఆరాతీస్తే .. థియేటర్ లో నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడు.. అక్కడ ఇంకా బాగా చేస్తే బావుండేదే. ఇంకా ఇంకా బాగా నటించాల్సింది.. అనిపిస్తుంటుంది. అలా అనిపిస్తుంది కాబట్టే నన్ను నేను చూడాలని అనుకోను.. అంటూ అసలు సంగతిని చెప్పింది.
పోనీ మిమ్మల్ని మీరు తెరపై చూసుకోలేకపోయినా.. మీలో మీకు నచ్చేది ఏంటి? అని అడిగితే.. నలుగురితో గడపడం అని ఠకీమని సమాధానమిచ్చింది. ఒంటరితనం అస్సలు నచ్చదు. చుట్టూ ఎప్పుడూ ఓ నలుగురు ఉండాల్సిందే.. అంటూ చెప్పుకొచ్చింది. అసలింతకీ ఆ నలుగురిలో బోయ్ ఫ్రెండ్ ఉండాలా? వద్దా అన్నది మాత్రం చెప్పనేలేదు. దిస్ ఈజ్ టూమచ్.