• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత ట్వీట్ కు అతను ఫిదా...

సమంత ట్వీట్ కు అతను ఫిదా అయిపోయాడు

By - Tupaki Desk
Update: 2017-05-07 07:05 GMT
సమంతకు ట్విట్టర్లో ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన స్వీట్ స్వీట్ మెసేజులతో అభిమానుల్నే కాదు.. సెలబ్రెటీల్ని కూడా మురిపిస్తూ ఉంటుంది సామ్. సౌత్ ఇండస్ట్రీలో సెలబ్రెటీలకు సంబంధించి ఏ ముఖ్యమైన అకేషన్ వచ్చినా సమంత గుర్తుంచుకుని విష్ చేస్తుంది. తాజాగా ఆమె మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కు కూతురు పుట్టిన నేపథ్యంలో విష్ చేసింది. ఈ వండర్ ఫుల్ న్యూస్ చెప్పినందుకు కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేసింది.

సమంత లాంటి స్టార్ హీరోయిన్ గుర్తుంచుకుని తనను విష్ చేసినందుకు దుల్కర్ చాలా సంతోషించాడు. ‘‘థ్యాంక్ యు సో మచ్ సామ్.. సో స్వీట్ ఆఫ్ యువర్ మెసేజ్.. చై కూడా నన్ను విష్ చేశాడు. మీ ఇద్దరిపై మా ప్రేమ కొనసాగుతుంది’’ అని ట్వీట్ చేశాడు. దీనికి సమంత మళ్లీ స్పందించి థ్యాంక్స్ చెప్పింది. మరోవైపు రానా దగ్గుబాటి.. నాగచైతన్యలతో పాటు మరిందరు సెలబ్రెటీలు దుల్కర్ కు కంగ్రాట్స్ చెప్పారు.

మమ్ముట్టి వారసుడిగా మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దుల్కర్.. అద్భుతమైన నటనతో చాలా త్వరగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్నపుడే అమల్ సుఫియాను 2011లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇప్పుడే అమ్మాయి పుట్టింది. ‘ఓకే బంగారం’ సినిమాతో అటు తమిళం.. ఇటు తెలుగులోనూ అభిమానుల్ని సంపాదించుకున్న దుల్కర్.. ప్రస్తుతం ‘కామ్రేడ్ ఇన్ అమెరికా’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Samantha 
  • Nagachaitanya 
  • Dulkar Salman 
  • Telugu NEWs 

Similar News

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

'రణబాలి' లో ఆ ఒక్కటి మిస్ అయిందా?

2026-11-18 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS