మహిళలను ప్రశ్నించే సమాజం.. మగవాళ్లను మాత్రం ఎందుకు ప్రశ్నించదు?: సమంత
పదేళ్ల స్నేహం బంధం.. ఏడేళ్ల ప్రేమ.. నాలుగేళ్ళ వివాహ బంధానికి అక్కినేని నాగచైతన్య - సమంత జంట స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. 2017 అక్టోబర్ 7న ప్రేమ వివాహం చేసుకున్న చై-సామ్.. మొన్న గాంధీ జయంతి రోజున విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇకపై తాము భార్యాభర్తలుగా ఉండబోమని.. స్నేహితులుగా మాత్రం కొనసాగుతామని తెలిపారు. ఈ లవ్లీ కపుల్ తమ ప్రేమ కథకు ఊహించని విధంగా అర్థాంతరంగా ఫుల్ స్టాప్ పెట్టడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సమంత - చైతన్య ల విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది.
చై-సామ్ విడిపోవడంపై సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతూనే ఉంది. ఎవరికి తోచింది వారు మాట్లాడుతూ ఊహాగానాలతో కథలు అల్లేస్తున్నారు. పక్కనే ఉండి చూసినట్లు కారణాలు ఇవేనంటూ విశ్లేషణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు నాగచైతన్య ని తప్పుబడుతుంటే.. మరికొందరు సమంత ని ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై చైతన్య ఎప్పటిలాగానే సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. సామ్ మాత్రం పరోక్షంగా ఏదో అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో స్టోరీలు పెడుతోంది.
తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఆలోచింపజేసేదిగా ఉంది. ఈరోజు ఉదయం అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పిన సామ్.. రచయిత ఫరీదా రాసిన ఒక కోట్ ని షేర్ చేసింది. ''ఏదైమైనా ఎప్పుడూ మహిళలనే ప్రశ్నించే ఈ సమాజం మగవాళ్లను మాత్రం ఎందుకు ప్రశ్నించదు.. అలాంటప్పుడు మనకు ప్రాథమికంగా నైతికత లేనట్లే'' అని ఈ కొటేషన్ లో పేర్కొన్నారు. ఓ జంట విడిపోతే తప్పంతా మహిళదే అన్నట్టు ఈ సమాజం వేలెత్తి చూపిస్తుందని.. సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి బయట జరుగుతున్న రచ్చ ను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టినట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.