ఫోటో స్టొరీ: పబ్ లో చై-సామ్ హగ్-కిస్

Update: 2018-09-25 08:22 GMT
టాలీవుడ్లో ఉన్న క్యూట్ స్టార్ కపుల్స్ లో చై-సామ్ జంట టాప్ లో ఉంటుంది. అటువైపు చైతు.. ఇటు వైపు సమంతా మల్టిపుల్ ప్రాజెక్టులలో ఒకే సారి పనిచేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అందుకేనేమో ఈ అక్కినేని జంట అఖిల్ తో కలిసి వెకేషన్ కు వెళ్ళింది.  హాలిడే అంటే ఇక ఫుల్ ఫన్నే కదా.

ఆ ఫన్ మూమెంట్స్  ఎంజాయ్ మెంట్ ను అభిమానులతో ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది సామ్.  అందులో ఒక ఫోటోలో చైతు ను గట్టిగా హగ్ చేసుకొని ముద్దిచ్చింది. పబ్ లో అక్కినేని జంట కలిసి డ్యాన్స్ చేస్తూ రొటీన్ షూటింగ్ ల హంగామా నుండి కాసేపు బయటకు వచ్చి పర్సనల్ స్పేస్ ను ఫుల్ గా వాడుకున్నారన్నమాట.  ఈ ఫోటో కు 'మై రే ఆఫ్ లైట్ చైతు' అని క్యాప్షన్ ఇచ్చింది.

మరో ఫోటోలో చైతు - అఖిల్ ఇద్దరూ తమ చేతులని పైకెత్తి డీజే మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.  ఈ ఫోటోకు 'అఖిల్.. చైతు.. ఫ్యామిలీ స్టిక్ టుగెదర్' అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పటికే సెప్టెంబర్ అక్కినేని మంత్ అని నాగార్జున చెప్పాడు.  రిలీజ్ లు.. ప్రమోషన్స్.. హాలిడేలు.. ఫోటోలు.. ఇవన్నీ చూస్తుంటే అక్కినేని వారి హంగామా మామూలుగా లేదు!
Tags:    

Similar News