సమంత ముద్దు.. పవన్ వద్దు.. ఎందుకు?
తెలంగాణ మంత్రి కేటీఆర్ కొంత కాలంగా నేతన్నలకు అండగా నిలుస్తున్నాడు. చేనేత ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి.. వాటిని లాభసాటిగా మార్చడానికి తన వంతుగా గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఇందుకోసం సెలబ్రెటీలు కూడా ముందుకు రావాలని కోరుతున్నాడు. ఇలాంటి తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చాడు. తాను చేనేత ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉంటానన్నాడు. కానీ కేటీఆర్.. పవన్ సేవలు తీసుకోవడానికి ఒప్పుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పవన్ విషయంలో ఏమీ స్పందించని కేటీఆర్.. సమంతను ఇందుకోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుని ఆమెతో ప్రమోషన్ కూడా మొదలుపెట్టించేయడం ఆసక్తి రేకెత్తించింది. మరి పవన్ లాంటి వాడు ముందుకొస్తే అతణ్ని కాదని.. సమంతను ఎంచుకోవడానికి కారణమేంటి అని అంతా చర్చించుకుంటున్నారు. సమంత అసలు తెలుగమ్మాయే కాదన్న విషయాన్ని కూడా కొందరు లేవనెత్తుతున్నారు.
ఐతే జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న పవన్ ను ప్రచారకర్తగా ఎంచుకోవడానికి టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎంత మాత్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. అందులోనూ పవన్ ఇంతకుముందు టీఆర్ ఎస్ పార్టీ మీద విమర్శలు గుప్పించాడు. పైగా ప్రస్తుతం పవన్ ఆలోచనలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టే తిరుగుతున్నాయి. అతడిపై ఆంధ్రా వ్యక్తిగానే ముద్ర వేసేశారు జనాలు. అందుకే పవన్ ను చేనేత ఉత్పత్తుల కోసం ప్రచారకర్తగా పెట్టుకోవడానికి కేటీఆర్ అండ్ కో ఆసక్తి చూపించలేదు. ఇక సమంత విషయానికి వస్తే.. ఆమె తెలుగునాట పెరిగి ఉండకపోవచ్చు కానీ.. ఆమె తండ్రి తెలుగువాడే. పైగా ఇప్పుడు తెలుగింటి కోడలు కూడా అవుతోంది. కాబట్టి ఆమె విషయాల్లో తలెత్తిన అభ్యంతరాల్ని లైట్ తీసుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/