• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శంషాబాద్ విమానాశ్ర‌యంలో...

శంషాబాద్ విమానాశ్ర‌యంలో వీళ్ల‌కేం ప‌ని?

By - Tupaki Desk
Update: 2019-10-07 16:00 GMT
2018 త‌మిళ్ బ్లాక్ బ‌స్ట‌ర్ 96 సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. త్రిష క‌థానాయిక‌గా.. విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాకి సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ద్రాస్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై నంద‌గోపాల్ నిర్మించారు. 96 చిత్రానికి అందులో త్రిష‌.. సేతుప‌తిల న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఎంతో కాలంగా వేచి చూస్తున్న ఆ ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ త్రిష కెరీర్ కి బిగ్‌ బూస్ట్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ సినిమాని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత‌- శ‌ర్వానంద్ జంట‌గా న‌టిస్తున్నారు.  మాతృక ద‌ర్శ‌కుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇదివ‌ర‌కూ 96 కోసం బ్యాంకాక్ లో వాట‌ర్ స్పోర్ట్స్ ప్రాక్టీస్ కి వెళ్లిన శర్వాకి ఊహించ‌ని ప్ర‌మాదంతో భుజానికి గాయం అయిన సంగ‌తి తెలిసిందే. ఆ గాయం వ‌ల్ల సుమారు నెల‌రోజులు పైగానే చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం శ‌ర్వా పూర్తి స్థాయిలో కోలుకుని షూటింగులో పాల్గొంటున్నారు. రెండో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణను హైద‌రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొన‌సాగిస్తున్నారు. అక్క‌డ స‌మంత‌- శ‌ర్వానంద్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీ బిజీగా క‌నిపించారు.

స‌మంత ప‌క్కా ట్రెడిష‌నల్ లుక్ లో క‌నిపిస్తే.. శ‌ర్వా బ్లూ స్వెట్స్ -ట్రాక్ లో క‌నిపించారు. ఆ ఇద్ద‌రిపై కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. ఇక శ‌ర్వా న‌టించిన ర‌ణ‌రంగం ఫ్లాప్ గా నిల‌వ‌డం నిరాశ‌ప‌రిచింది. స‌మంత మాత్రం ఓబేబితో హిట్టు కొట్టి రెట్టించిన ఉత్సాహంలో క‌నిపిస్తోంది. ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లోని 96 చిత్రంపై చాలానే అంచ‌నాలు ఉన్నాయి. స్కూల్ రీయూనియ‌న్ మీటింగ్ లో క‌లిసి ఇద్ద‌రు చిన్న‌నాటి స్నేహితుల జీవితంలో సంఘ‌ట‌న‌ల స‌మాహార‌మే ఈ చిత్రం.
Tags:    
  • Samantha 
  • Sharwanand 
  • 96 Movie 
  • Samshabad Airport 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS