సమంతా నడకదారి.. చైతు మాత్రం కారులో!

Update: 2019-04-03 09:32 GMT
రీసెంట్ గా సమంతా - నాగ చైతన్య తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకన్న సంగతి తెలిసిందే.  తమ కొత్త చిత్రం 'మజిలీ' విజయం సాధించాలనే ఉద్దేశంతో చై-సామ్ జంట వెంకటేశ్వరస్వామిని ప్రార్థించారు.  చై-సామ్ లు దర్శనం చేసుకున్న సమయంలో వారితో పాటు సీనియర్ కమెడియన్  బ్రహ్మానందం కుటుంబ సభ్యుల కూడా తోడుగా ఉన్నారు.

సమంతా తిరుమల కొండపైకి కాలిబాటలో నడుచుకుంటూ వెళ్ళగా.. చైతు మాత్రం కారులోనే వెళ్ళాడు. గెస్ట్ హౌస్ దగ్గర ఇద్దరూ కలుసుకున్నారు.  దారులు వేరైనా గమ్యం ఒకటే కదా. సమంతా ఇలా కాలినడకన తిరుమలకు చాలాసార్లే వెళ్ళింది కానీ తన వివాహం తర్వాత మాత్రం మొదటిసారి.  ఈ ట్రిప్ లోనే చైతు-సమంతా జంట కొన్ని ఇతర ఆలయాలను కూడా సందర్శించుకున్నారని.. పూజలు జరిపారని సమాచారం.  ఈ లిస్టులో సంతాన వేణుగోపాలస్వామి ఆలయం కూడా ఉందని అంటున్నారు.

'మజిలీ' ఏప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.  చైతు-సమంతాలు వివాహం తర్వాత కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై బజ్ ఉంది.  దానికి తోడుగా ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ కూడా సినిమాపై ఇంకా ఆసక్తిని పెంచాయి.  కాంపిటీషన్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం 'మజిలీ' కి ప్లస్ అయినప్పటికీ ఎలెక్షన్స్ సీజన్ కావడంతో జనాల ఫోకస్ సినిమాలపై లేదు. మరి ఇది ఎంతమాత్రం సినిమా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపిస్తుందో వేచి చూడాలి. 
Tags:    

Similar News