• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంతా హార్ట్ ఎమోజీ తో...

సమంతా హార్ట్ ఎమోజీ తో జేజేలు పలికిందే!

By - Tupaki Desk
Update: 2019-12-04 09:16 GMT
గతంలో పోలిస్తే ఈ జెనరేషన్ హీరోయిన్ల కు ఫ్యాషన్ సెన్స్ ఎక్కువనే చెప్పాలి. ఇది కొందరికి అతి శయోక్తిగా అనిపించవచ్చు కానీ నిజం మాత్రం ఇదే.  జిమ్ము డ్రెస్సులకు కూడా డిజైనర్ వేర్ వాడే జమానా ఇది. జాన్వి.. కియారా లాంటి కొత్త తరం భామల కలర్ఫుల్ టీ షర్టులు.. మినీలు మైక్రోలు చూస్తే ఈ విషయం నిజమని ఎవరైనా చచ్చినట్టు ఒప్పుకుంటారు.  ఇక ఫోటో షూట్ల కోసం ధరించే డిజైనర్ డ్రెస్సులను చూస్తే ఎవరికైనా మతి పోవడం ఖాయం.

బాలీవుడ్ భామలు ఈ ట్రెండ్ లో సౌత్ బ్యూటీల కంటే ముందే ఉన్నారు.  అయితే సౌత్ లో కూడా సమంతాలాంటి స్టార్ హీరోయిన్లు ఫ్యాషన్ ట్రెండ్స్ ను భలేగా ఫాలో అవుతూ ఫ్యాషనిస్టా.. ఫ్యాషన్ ఐకాన్ లాంటి బిరుదులు తెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ భామలు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఫోటోలను షేర్ చేసిన సమయంలో వారికి జేజేలు కూడా తెలుపుతున్నారు.  కొద్దిరోజుల క్రితం సోనమ్ కే. అహూజా రాల్ఫ్ లారెన్ బ్రాండ్ వారి ప్యాంట్ సూట్ డ్రెస్ ధరించింది.  ఈ డ్రెస్.. సోనం స్టైల్ చూసి భలేగా ఉందని సమంతా ముచ్చట పడిపోయింది.

ఇదిలా ఉంటే తాజా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలలో అనుష్క శర్మ ఒక క్రీమ్ కలర్ డ్రెస్ లో కనిపించింది.  రౌండ్ నెక్ కాలర్.. పఫ్ఫీ షోల్డర్స్.. థై స్లిట్ డిజైన్ ఉండే డ్రెస్ లో అనుష్క ఒక కుర్చీపై కూర్చుంది. గోల్డ్ కలర్ హై హీల్స్ డ్రెస్ కు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. డిఫరెంట్ హెయిర్ స్టైల్ ను చూస్తే అనుష్క ఒక సూపర్ మోడల్ లాగా కనిపించింది.  ఈ ఫోటోలకు సమంతా ఒక రెడ్ హలర్ హార్ట్ ఎమోజి తో తన స్పందన తెలపడం విశేషం.  అంటే అనుష్క డ్రెస్.. స్టైల్..  సామ్ హార్ట్ ను టచ్ చేసిందనేగా అర్థం.
Tags:    
  • Samantha Akkineni 
  • Anushka Sharma 
  • Bollywood 
  • Bollywood Actress 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Samantha Praises Anushka Dress 
  • Tupaki News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS