పరీక్షలో ఊ అంటావా మావా వీడియోకు సామ్ రియాక్షన్‌

Update: 2021-12-20 06:45 GMT
అల్లు అర్జున్‌.. సుకుమార్ ల పుష్ప సినిమా లో యాక్షన్ సన్నివేశాలు కేజీఎఫ్ ను మించి ఉన్నాయనే టాక్‌ బయట ఉంది. కాని అంతకు మించి సమంత చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ గురించిన చర్చ జరుగుతోంది. సినిమా మొత్తంను కూడా ఆ పాట డామినేట్ చేసింది అనేది కొందరి అభిప్రాయం. ఆ విషయం పక్కన పెడితే ఆ పాటను ఇన్ స్టా గ్రామ్‌ రీల్స్ లో వేల మంది పేరడీలు చేస్తుంటే కోట్ల మంది చూస్తున్నారు. కొందరు ఆ పాటకు క్రియేటివిటీని జోడించగా మరి కొందరు మసాలా యాడ్‌ చేస్తున్నారు. కొందరు మీమ్స్ చేస్తుంటే కొందరు పేరడీలు చేస్తున్నారు.

మొత్తానికి పాట మాత్రం ఓ రేంజ్ లో కుమ్మేస్తోంది. ప్రముఖ ఫోక్ సింగర్‌ మంగ్లీ చెల్లి పాడిన ఆ పాట కు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు దేవి శ్రీ ప్రసాద్‌ చేసిన కామెంట్స్ తో వివాదం రాజుకోవడంతో మరింతగా పాట పాపులర్ అయ్యింది. సినిమా విడుదల తర్వాత సమంత డాన్స్ కు అందాల ఆరబోతకు అబ్బా అంటూ అభిమానులు ప్రేక్షకులు నోరు తెరుస్తున్నారు.

పుష్ప రాజ్ తో సమానంగా ఐటెం సాంగ్ గురించి కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ఐటెం సాంగ్ సుకుమార్ కు మాత్రమే సాధ్యం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా కొందరు కుర్రాళ్లు ఈ పాట పేరడిగా చేసిన వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. దాదాపుగా మిలియన్ వ్యూస్‌ ను దక్కించుకున్న ఈ వీడియో సమంత స్పందించింది.

దాంతో మరింతగా ఆ వీడియో పాపులర్ అయ్యింది. వీడియో లో డల్ గా ఉన్న స్నేహితుడి వద్దకు వచ్చిన ఇద్దరు కుర్రాళ్లు ఎంట్రా అలా ఉన్నావ్‌ అంటే పరీక్ష రా అంటాడు. అప్పుడు చదవలేదా అంటూ ప్రశ్నించగా అది కాదురా పరీక్షలో ఎక్కడ ఊ అంటావా మావ అని రాస్తానో భయంగా ఉందని అంటాడు. అంతగా జనాల్లో పాట నానుతోంది. ఎక్కడ చూసినా.. ఏం చేసినా ఆ పాట వినబడుతుంది.. మనలో మెదులుతుంది అనేది ఆ వీడియో ఉద్దేశ్యం.

ఆ కుర్రాళ్లు చేసిన వీడియోకు సమంత స్పందించింది. వీడియోకు సోషల్‌ మీడియా ద్వారా స్మైల్ ఈమోజీని షేర్ చేసింది. సమంత మరియు అల్లు అర్జున్ ల మాస్ స్టెప్పులు పాట స్థాయిని మరింత గా పెంచాయి. పైగా సింగర్ చాలా రొమాంటిక్ గా డ్రమటిక్ గా పాడటం వల్ల కూడా పాటకు ఈ స్థాయిలో గుర్తింపు వచ్చింది అనడంలో సందేహం లేదు.

ప్రతి ఒక్కరు కూడా ఈ పాటను హమ్ చేయడం జరుగుతుంది. చిన్న పిల్లలు పెద్ద వారు అంతా కూడా ఈ వీడియోకు రీల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరో వైపు ఈ పాట మగవారి మనోభావాలు దెబ్బ తీశాయి అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పాట రాసిన రచయిత మగ జాతికి క్షమాపణలు చెప్పాడు. మరి వివాదం ముగిసినట్లేనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సమంత ఐటెం సాంగ్ చేయడం ను కొందరు మొదట వ్యతిరేకించారు. కాని పాట విడుదల తర్వాత వారి నోళ్లు మూత పడ్డాయి. ఇలా అన్ని రకాలుగా ఈ పాట మీడియాలో సంచలనంగా నిలిచింది. 2021 ఒక మాంచి ఐటెం సాంగ్ తో ముగిస్తున్నందుకు చాల సంతోషంగా ఉందంటూ శ్రోతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.




Tags:    

Similar News