సమంత ఇక్కడ.. మరి చైతూ ఎక్కడ..?
టాలీవుడ్ లో లవ్లీ కపుల్ గా చెప్పుకునే అక్కినేని నాగచైతన్య - సమంత తమ నాలుగేళ్ళ వైవాహిక బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. చై-సామ్ జంట విడిపోతారంటూ గత కొంతకాలంగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశారు. వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ముచ్చటైన జంటగా మన్ననలు అందుకున్న సమంత - చైతన్య.. పదేళ్ల అనుబంధానికి ఫుల్ స్టాప్ పెట్టడం పై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
చై-సామ్ జంట విడిపోవాలనే బలమైన నిర్ణయం తీసుకోడానికి గల కారణాలు ఏంటని గత వారం రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సెలబ్రిటీ కపుల్ విడాకుల వ్యవహారమే హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే చైతన్య తో విడిపోయినా కూడా సమంత హైదరాబాద్ లోనే ఉండాలని నిర్ణయించుకుంది. పెళ్లి చేసుకున్న కొత్తలో చైతన్య - సమంత కలిసి తీసుకున్న గచ్చిబౌలిలోని జయభేరి 16త్ ప్లోర్ లోనే సామ్ ప్రస్తుతం ఉంటోందని సమాచారం.
మరోవైపు నాగచైతన్య ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారనేది క్లారిటీ లేదు. సమంత తో విబేధించిన తర్వాత హైదరాబాద్ లోని ఖరీదైన ఐటీసీ కోహినూర్ హోటల్ లో చైతూ ఉంటున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. మరి ఇప్పటికీ అక్కడే ఉంటున్నారా.. లేదా మరో చోటికి షిఫ్ట్ అయ్యారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇంకా హోటల్ లోనే ఉంటే త్వరలోనే హైద్రాబాద్ లో చై మరో కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కాగా, పరస్పర అంగీకారంతో విడిపోయిన నాగచైతన్య - సమంత తమ వృత్తిపరమైన జీవితాల్లో బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. తమ కుటుంబాలతో కలిసి హ్యాపీగా న్యూ లైఫ్ ని రీ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సామ్ బాలీవుడ్ దర్శకుడు విశేష్ వర్మ రూపొందించే ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నట్లు సమాచారం. అలానే ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షో కు సెలబ్రిటీ గెస్టుగా వెళ్ళినట్లు తెలుస్తోంది.
నాగచైతన్య కూడా ఈ ఇష్యూ నుంచి వీలైనంత త్వరగా బయటకు రావాలని చూస్తున్నారు. సోదరుడు అఖిల్ అక్కినేని నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా చై హాజరు కానున్నారు. విడాకుల ప్రకటన తర్వాత చైతన్య ఫస్ట్ పబ్లిక్ అప్పీరియన్స్ ఇదే అవుతుంది. ఇక 'బంగార్రాజు' 'థాంక్యూ' షూటింగ్ లలో పాల్గొననున్నారు. వచ్చే నెల నుంచి ఓ వెబ్ సిరీస్ ను కూడా మొదలు పెట్టడానికి చైతూ ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇక చైతన్య - సమంత కలిసి చేసిన సినిమాల విషయానికొస్తే.. 'ఏమాయ చేసావే' తో మొదలైన వీరి ప్రయాణం.. 'మనం' 'ఆటో నగర్ సూర్య' వంటి సినిమాలతో మరింత బలపడింది. ఈ క్రమంలో పెద్దలను ఒప్పించి 2017 అక్టోబర్ 7న ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత కూడా ఈ జంట 'మజిలీ' సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్నారు. అలానే సమంత ప్రధాన పాత్రలో రూపొందిన 'ఓ బేబీ' చిత్రంలో చైతూ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఇలా మొత్తం ఐదు పాత్రల్లో చై-సామ్ నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రేమికులుగా - దంపతులుగా - స్నేహితులుగా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అలాంటి ఈ జంట విడిపోవడం అభిమానులను బాధిస్తోంది. మరో భవిష్యత్ లో కలిసి వెండితెర మీద కనిపించి ఆడియన్స్ ని అలరిస్తారేమో చూడాలి.