• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిమిషానికే 50ల‌క్ష‌లు...

నిమిషానికే 50ల‌క్ష‌లు అందుకున్న స్టార్ హీరో

By - Tupaki Desk
Update: 2021-09-19 00:30 GMT
బాద్ షా షారుక్ ఖాన్ సినిమాల్లోనే కాదు.. బుల్లి తెర‌పైనా ఎంతో ఫేమ‌స్. ఎన్నో టెలివిజ‌న్ షోల‌కు బాద్ షా హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించా రు. నేరెట‌ర్ గా....డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గాను షారుక్ ఫేమ‌స్. ప‌లు డాక్యుమెంట‌రీల్లోనూ షారుక్ ప్ర‌మేయం ఉంది. అందుకే ఇప్పుడు షారుక్ ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అక్క‌డా త‌న మార్క్ వేయ‌డానికి షారుక్ రెడీగా ఉన్న‌ట్లు ఓ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నిర్ధారించింది. షారుక్ ఖాన్ కి స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌డానికి స‌ద‌రు కార్పోరేట్ కంపెనీ ఏకంగా బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ నే రంగంలోకి దించుతోంది. షారుక్ ఎంట్రీని ఖ‌రారు చేస్తూ స‌ల్మాన్ ఓ ఓటీటీ  యాడ్ లో న‌టించ‌బోతున్నారు.

దీనికి గాను స‌ద‌రు సంస్థ స‌ల్మాన్ కి భారీగా పారితోషికం ఇస్తోంది. కేవలం కొన్ని నిమిషాల యాడ్ కోసమే స‌ల్మాన్ కి 50 ల‌క్ష‌లు పారితోషికం ఇస్తున్నారుట‌. ఇలా ఓ స్టార్ హీరో ఎంట్రీని మ‌రో స్టార్ హీరోతో ప‌రిచ‌యం చేయ‌డం కూడా ఇదే తొలిసారి. అలాగే ఇంత చిన్న యాడ్ కోసం  50 లక్ష‌లు ఛార్జ్ చేస్తోన్న హీరో కూడా ఒకే ఒక్క‌డు కావ‌డం విశేషం. ఇది సల్మాన్ బ్రాండ్ వ్యాల్యూకి మ‌రోక సంకేతంగా చెప్పొచ్చు. మ‌రి షారుక్ ఎంట్రీ ఇస్తోన్న ఓటీటీ కంపెనీ ఏది? ఎలాంటి క‌థాంశంతో బాద్ షా ప‌రిచ‌యం అవుతారు?  ఆ సిరీస్ కి ద‌ర్శ‌కుడు ఎవ‌రు త‌దిత‌ర వివ‌రాలు గోప్యంగా ఉంచారు. ప్ర‌స్తుతం షారుక్ `ప‌ఠాన్`..`ల‌య‌న్` చిత్రాల్లో న‌టిస్తున్నారు. అలాగే మిస్ట‌ర్ ప‌ర్ పెక్ట్ నిస్ట్ న‌టిస్తోన్న `లాల్ సింగ్ చ‌ద్దా`లో గెస్ట్ అప్పిరియ‌న్స్ ఇస్తున్నారు. ఇక స‌ల్మాన్ ఖాన్ హీరోగా  టైగ‌ర్ -3 తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.  ప్ర‌స్తుతం ఆస్ట్రియాలో షూటింగ్ జ‌రుగుతోంది. స‌ల్మాన్ స‌హా కీల‌క న‌టులంతా ఆస్ట్రియా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

స‌ల్మాన్ వ‌ర్సెస్ షారూక్.. తెలిసిన క‌థే

బాలీవుడ్ లో ఖాన్ ల మ‌ధ్య గొడ‌వ‌ల గురించి తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్ వ‌ర్సెస్ షారూక్ ఖాన్ ఎపిసోడ్స్ ఒక సంచ‌ల‌నం. ర‌క‌ర‌కాల విభేధాల‌తో నైట్ పార్టీల్లో గొడ‌వ‌లు అటుపై క‌ల‌త‌లు క‌ల్లోలాలు అదంతా బాలీవుడ్ సినీవ‌ర్గాలు స‌హా అన్నిచోట్లా వైర‌ల్ గా తెలిసిన విష‌య‌మే. అయితే ఆ ఇద్దరూ చాలా కాలం పాటు బెట్టు వీడ‌క ఎదురు ప‌డినా ముఖాముఖాలు చూసుకోలేదు. కానీ ఇటీవ‌ల అంతా మారింది. ఆ ఇద్ద‌రూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.

అస‌లు ఆ ఇద్ద‌రి మ‌ధ్యా శ‌త్రుత్వం తొల‌గిపోవ‌డానికి అస‌లు కార‌ణం స‌ల్మాన్ సోద‌రి అర్పితా ఖాన్‌. అర్పితా ఖాన్ - ఆయుష్ శర్మ వివాహం షారూఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ మధ్య శ‌త్రుత్వాన్ని ఐస్ గ‌డ్డ‌లా కరిగించింది. కొన్నేళ్లుగా మాటలు లేకపోయినా ఆ పెళ్లితో అన్నిటినీ వ‌దిలేశారు. 2014 లో అర్పితా ఖాన్  వివాహంలో  ఒక‌రితో ఒక‌రు క‌లిసిపోయారు. నిజానికి ఆ ఇద్దరికీ గొడ‌వ ఎక్క‌డ మొద‌లైంది? అంటే.. కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుక‌లో ప్రారంభమైన ఫిక‌ర్ సంవత్సరాల పోరాటంగా మారింది. ఆ త‌ర్వాత‌ చివరికి 2014 లో అర్పిత దానికి సొల్యూష‌న్ ఇచ్చింది.

షారూఖ్ - సల్మాన్ .. ఓసారి బాబా సిద్దిక్ వార్షిక ఇఫ్తార్ పార్టీలో కౌగిలించుకున్నా.. నెమ్మ‌దిగా అది అర్పిత-ఆయుష్ వివాహంలో అంత‌మైంది. హైదరాబాద్  తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో గ్రాండ్ వెడ్డింగ్ కి కొన్ని రోజుల ముందు జరిగిన కార్యక్రమానికి స‌ల్మాన్ ఆహ్వానం మేర‌కు షారుఖ్ హాజ‌ర‌య్యారు. “నేను ఖచ్చితంగా వెళ్తాను. అర్పిత చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచీ నాకు తెలుసు. నేను ఆమెను నా చేతుల్లోకి తీసుకున్నాను. ఆమె నాకు సోదరి లాంటిది. నిజానికి నాకు ఆహ్వానం కూడా అవసరం లేదు. వారు మా కుటుంబం లాంటివారు. నేను వెళ్తాను`` అంటూ షారూక్ అప్ప‌ట్లో ఎమోష‌న్ అయ్యారు. షారుఖ్ పెళ్లికి హాజరు కాలేకపోయినా.. ముంబైలో జరిగిన అర్పిత‌ సంగీత్‌ కార్యక్రమానికి హాజరయ్యాడు. రిసెప్షన్ లో అతను అతిథులను పలకరించాడు... కుటుంబ సభ్యుడిలాగే నృత్యం చేశాడు.

ఆ నెల తరువాత జరిగిన ఒక కార్యక్రమంలో షారుఖ్ .. త‌న కోస్టార్ స‌ల్మాన్ తో ప్యాచ్-అప్ గురించి మాట్లాడారు. ``అహంకారంతో కాదు.. చాలా వినయంతో నేను మాట్లాడుతున్నాను. సల్మాన్ తో నా జీవితంలో చాలా ఆనందకరమైన క్షణాలు ఉన్నాయి. చాలా కొద్ది క్షణాలు మాత్ర‌మే బాధపడ్డాం. కాని నేను భరోసా ఇవ్వగల ఒక విషయం ఏమిటంటే.. జీవితంలో మనం ఒకరికొక‌రు షేర్ చేసుకునేందుకు ఎల్లప్పుడూ క‌లిసే ఉంటాం. ఒకరి ఆనందం.. నిరాశ క్షణాలు షేర్ చేసుకుంటూనే ఉన్నాం`` అని తెలిపారు. “నేను సల్మాన్ వ్యక్తిగతంగా కలిసినప్పుడు మా సంబంధం 25 సంవత్సరాల క్రితం ఉన్నట్లేఉంది. మా మ‌ధ్య ఎలాంటి చెడు లేదు. బయటి నుండి.. మేము పఠాన్లు .. హాట్ హెడ్ కుర్రాళ్ళు.. కొన్ని సమయాల్లో సమస్యలను కలిగి ఉంటాం. కానీ దానికి మించి ఏమీ లేదు. అర్పిత నాకు కూడా చాలా క్లోజ్‌. నా కళ్ళ ముందు పెరగడం చూశాను. కాబట్టి ఇక్కడ సారాంశం ఏమిటంటే మా సోదరి వివాహం చేసుకుంటోంది. మేం అక్కడ ఉండాల్సి వచ్చింది” అంటూ షారూక్ అన్నారు.
Tags:    
  • salman khan 
  • salman khan movies 
  • salman khan tiger 3 
  • Salman Remuneration 
  • Tv Show 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS