టాప్ స్టోరి: అభిమానుల సెల్ఫిచ్చి టూమ‌చ్

Update: 2020-01-29 04:37 GMT
దేనికైనా ఓ హ‌ద్దు ఉంటుంది. హ‌ద్దుమీర‌నంత‌ వ‌రకే మ‌ర్యాద‌. బార్డ‌ర్ దాటితే ఇదిగో ఇలాగే ఉంటుంది. అది అభిమాని అయినా .. వేరొక‌రు అయినే ఇంతే సంగ‌తి. భాయ్ స‌ల్మాన్ ముందే అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి అడ్డంగా బుక్క‌యిపోయాడీ వీరాభిమాని. అస‌లేం జ‌రిగింది అంటే?

అభిమానుల అత్యుత్సాహంతో స్టార్ హీరోల‌కు ఎప్పుడూ ఇబ్బందిక‌ర స‌న్నివేశం ఉంటుంద‌న్న‌ది చూస్తున్నదే. హీరోలు ఎంత కంట్రోల్ గా ఉండాల‌నుకున్నా కొన్ని సార్లు ఇర్రిటేట్ అవ్వాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. టాలీవుడ్ లో ప‌లువురు హీరోలకు ఇలాంటి అనుభ‌వాలు అయ్యాయి. ఫ్యాన్స్ అత్యుత్సాహం ఇర్రిటేట్ చేసిన సంద‌ర్భాలు చాలా ఎక్కువే ఉన్నాయి. అప్ప‌ట్లో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానుల‌ను కంట్రోల్ లో ఉంచే క్ర‌మంలో సీరియ‌స్ అయిన సంద‌ర్భాలు ఉన్నాయి. బాల‌య్య కోప‌గించుకున్నా అభిమానుల్ని అంతో ఇంతో అదుపులోకి తెచ్చుకోగ‌లిగారు. ఇక మిగ‌తా ఏ హీరో అలా కంట్రోల్ చేసిన వైనం చూడ‌లేం. వెర్రి అభిమానంతో మీద ప‌డాల్సిందే. ఒకానొక స‌మ‌యంలో ఎప్పుడూ కూల్ గా ఉండే మెగాస్టార్ చిరంజీవి సైతం ఓ అభిమాని పై ఉన్న‌ట్టుండి ఫైర్ అయి పోయారు. ఆ వీడియోలు సోష‌ల్ మీడియా లో జోరుగా వైర‌ల్ అయ్యాయి.

శిల్ప‌క‌ళా వేదిక‌ లో కారు దిగి వ‌స్తుండ‌గా క‌ర‌చాల‌నం కోసం ప్ర‌య‌త్నించిన అభిమాని ఆ తోపులాట‌లో నేరుగా వెళ్లి చిరంజీవి మీద‌నే ప‌డ్డాడు. ఆ స‌మ‌యంలో చిరు చాలా సీరియ‌స్ అయ్యారు. వెంట‌నే ఆ ఫ్యాన్ ని అదుపు చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఇక సోష‌ల్ మీడియా.. స్మార్ట్ ట్రెండ్ లో అభిమానం పీక్స్ కి చేరి పోయింది. హీరో కిలో మీట‌ర్ దూరంలో క‌నిపించినా వ‌దిలి పెట్ట‌కుండా క‌వ‌ర్ చేస్తూ సెల్ఫీలు దిగ‌డం మొద‌లు పెట్టారు. గుంపులో ఉన్నా...సింగిల్ గా ఉన్నా సెల్పీ దిగాల్సిందే. ఇటీవ‌ల త‌మిళ స్టార్ హీరో సూర్య తండ్రి శివ‌కుమార్ ఇలాగే అత‌ని ఫ్యాన్ సెల్ఫీ దిగుతుంటే ఆ ఫోన్ అందుకుని నెల‌కేసి కొట్టారు. ఇదొక్క‌టేనా.. చివ‌రికి సెల‌బ్రిటీ శ‌వాల‌తోనూ సెల్ఫీలు దిగిన వైనం చూశాం. దీనిపై అల్ల‌రి న‌రేష్ ఒక సినిమానే తీశాడు. త‌న తండ్రి అంత్య‌క్రియ‌ల రోజు ఫ్యాన్ సెల్ఫీ పిచ్చిని ఉన్మాదాన్ని న‌రేష్ ఇంట‌ర్వ్యూల్లో గుర్తు చేసుకోవ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

తాజాగా అలాంటి సీన్ ఒక‌టి భాయ్ స‌ల్మాన్ కి ఎదురైంది. గోవా- పానాజీ ఎయిర్ పోర్ట్ లో స‌ల్మాన్ ఖాన్ న‌డుచుకుంటూ వెళుతుంటే కొద్ది దూరంలో అభిమాని ఫోన్ పైకి ఎత్తి సెల్పీ దిగే ప్ర‌య‌త్నం చేసాడు. దీంతో స‌ల్మాన్ ద‌గ్గ‌ర‌కు రాగానే ఆ ఫోన్ ని బ‌ల‌వంతంగా లాక్కుని వెళ్లిపోయాడు. ఆ స‌మ‌యంలో స‌ల్మాన్ లో యాంగ‌ర్ ని చూసి శివ కుమార్ లా నేల‌కేసి కొడ‌తాడు అనుకున్నారంతా. కానీ శాంతించి సెలైంట్ గా వెళ్లిపోయాడు. అయితే ఆ ఫ్యాన్ కి ఫోన్ తిరిగి ఇచ్చాడా? లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News