ఆ ఇద్దరి భామల నయా స్ట్రాటజీ!
హీరోయిన్ల పాత్రల్లో ఎన్నో రకాల మార్పులు చోటుచుసుకుంటున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అంటే కేవలం పెద్ద సినిమాల్లో గ్లామర్ కోసమో? పాటల కోసమో? అనే భావన ఉండేది.;
హీరోయిన్ల పాత్రల్లో ఎన్నో రకాల మార్పులు చోటుచుసుకుంటున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అంటే కేవలం పెద్ద సినిమాల్లో గ్లామర్ కోసమో? పాటల కోసమో? అనే భావన ఉండేది. కానీ దీపికా పదుకోణే, రష్మికా మందన్నా వంటి అగ్ర కథానాయికలు ఆ మూస పద్ధతిని తాజాగా చెరిపేస్తున్నట్లే కనిపిస్తుంది. కెరీర్ ప్లానింగ్‌లో భారీ కమర్షియల్ చిత్రా లతో పాటు కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను , నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. దీపికా పదుకోణే కెరీర్‌ను గమనిస్తే కమర్శియల్ పాత్రలకు పూర్తిగా దూరం కాకుండా తెలివైన ఆట ఆడుతోంది.
ఓవైపు ఆ తరహా పాత్రలకు కమిట్ అవుతూనే? మరోవైపు `గెహ్రాయియాన్`, `పద్మావత్` వంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ సత్తా చాటిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సరసనే కాకుండా? కథను మలుపు తిప్పే బలమైన పాత్రల కోసం దీపిక ఫోకస్ చేసి పని చేస్తోంది. ఇది అమ్మడి మార్కెట్ విలువను పెంచడమే కాదు. నటిగా ఆమెలోని విలక్షణతను ప్రపంచానికి చాటి చెబుతోంది. టాలీవుడ్ సంచలనం రష్మిక మందన్నా? కూడా ఇదే బాటలో నడుస్తోంది. `పుష్ప` వంటి కమర్షియల్ సక్సెస్‌ల తర్వాత ఆమె కేవలం భారీ చిత్రాలకే పరిమితం కాకుండా? `మైసా` వంటి యాక్షన్ ఓరియెంటెడ్ రోల్స్ , చిన్న సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు కమిట్ అవుతోంది.
గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్‌కే ఎక్కువ మార్కులు పడతాయని గ్రహించిన రష్మిక విభిన్నమైన జోనర్లను ప్రయత్నిస్తోంది. అలా అమ్మడు తన ఇమేజ్‌ను మార్చుకుంటోంది. ఈ నేపథ్యంలో రష్మికకు అన్ని భాషల ప్రేక్షకులలో ఆదరణ పెరుగుతోంది. ఈ నయా స్ట్రాటజీ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం లాంగ్ కెరీర్. గ్లామర్ అనేది ఒక వయసు వరకే పరిమితం. కానీ నటన అనేది దశాబ్దాల పాటు గుర్తింపును ఇస్తుందని నేటి తరం హీరోయిన్లు నమ్ముతున్నారు. చిన్న సినిమాల్లో నటించడం వల్ల నటిగా వారి ప్రతిభకు పదును పెట్టడమే కాదు.
కొత్త దర్శకులకు అండగా నిలిచినట్లు అవుతుంది. దీంతో పరిశ్రమలో వారి గౌరవం పెరుగుతుంది.
అలాగే ఓటీటీ విప్లవం కూడా హీరోయిన్ల ఆలోచనా విధానంలో మార్పు తెచ్చిందన్నది కాదనలేని నిజం. పెద్ద సినిమాల్లో అతిథి పాత్రల కంటే? చిన్న సినిమాల్లో , వెబ్ సిరీస్‌లలో లీడ్ రోల్స్ వచ్చే గుర్తింపుతో మంచి అవకాశాలు ఒడిసి పట్టుకుంటున్నారు. బాక్సాఫీస్ లెక్కల కంటే ప్రేక్షకులు కంటెంట్‌కే పట్టం కడుతున్నారు. అందుకే స్టార్ హోదా ఉన్నా? రిస్క్ తీసుకొని విభిన్నమైన కథలను ఎంచుకోవడం హీరోయిన్ల ధైర్యానికి - దూరదృష్టికి నిదర్శనం. దీపికా పదుకొణే, రష్మికా మందన్నా? వంటి భామలు సృష్టిస్తోన్న ఈ ట్రెండ్ రాబోయే తరం హీరోయిన్లకు దిక్సూ చిలా మారుతోంది. గ్లామర్ అనేది అలంకారం మాత్రమేనని అసలైన బలం నటనలోనే ఉందని ఈ భామలు నిరూపిస్తున్నారు.