విజయ్, శౌర్యువ్.. మరో 'సర్ప్రైజ్'తో హైప్ ఎక్కించేలా..

హాయ్ నాన్న మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శౌర్యువ్ తో విజయ్ కొత్త సినిమా చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలపై ఇటీవల క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2026-04-19 16:45 GMT

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రణబాలి, రౌడీ జనార్దన్ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్న ఆయన.. తాజాగా మరో ప్రాజెక్ట్‌ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హాయ్ నాన్న మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శౌర్యువ్ తో విజయ్ కొత్త సినిమా చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలపై ఇటీవల క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే.



 


వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై రూపొందుతున్న ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. ఆ పోస్టర్‌ కు "ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమ" అనే క్యాప్షన్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. పోస్టర్‌ లో విజయ్ చేతుల్లో నాలుగు పెట్ డాగ్స్‌ ను పట్టుకుని నడుస్తూ కనిపిస్తుండగా.. ఆయన వెనుక ఏడుగురు వ్యక్తులు ఆయుధాలతో నిలబడటం సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఆ విజువల్స్ చూస్తే యాక్షన్‌ తో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న కథగా సినిమా ఉండబోతుందనే అర్థమమవుతోంది. అయితే సడెన్‌ గా సినిమాను అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. వెంటనే మరో సర్ప్రైజ్ ఇచ్చారు. "ఈ ఆగ్రహమంతా ఒకప్పుడు ప్రేమే. ఇప్పుడు ప్రతి గాయం, ప్రతి పతనం, ప్రతి విజయం ఒక గర్జనగా మారింది" అంటూ "ధట్స్ ఏ రోర్" లిరికల్ వీడియోను విడుదల చేశారు.

ఆ పాట పూర్తిగా ఇంగ్లీష్ లిరిక్స్‌ తో ఉండటం ప్రత్యేకతగా నిలిచింది. ర్యాప్ స్టైల్‌ లో సాగిన ఆ సాంగ్ యువతను ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి హైప్ పెంచుతోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ తన కంపోజిషన్‌ తో మరోసారి ప్రత్యేకత చాటుకున్నారు. లిరికల్ వీడియోలో ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను పలు యాంగిల్స్‌ లో చూపిస్తూ సినిమాకు సంబంధించిన టోన్‌ ను తెలియజేశారు.

ఓవరాల్ సాంగ్ సినిమా మీద ఉన్న ఆసక్తి మరింత పెంచింది. "ఈ కోపమంతా ఒకప్పుడు ప్రేమే" అనే క్యాప్షన్ ఆధారంగా చూస్తే.. ప్రేమలో విఫలమైన ఓ యువకుడి జీవిత ప్రయాణం, అతని భావోద్వేగాల మార్పు నేపథ్యంలో సినిమా కథ సాగనున్నట్లు తెలుస్తోంది. హాయ్ నాన్నలో తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించిన దర్శకుడు శౌర్యువ్.. ఈసారి పూర్తిగా భిన్నమైన యాక్షన్ జానర్‌ ఎంచుకున్నట్లు అర్థమవుతోంది.

త్వరలోనే మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ చిత్రానికి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అలెజాండ్రో మార్టినెజ్ పనిచేయడం విశేషం. హీరోయిన్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న ఇతర ప్రాజెక్టుల విషయానికి వస్తే.. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రణబాలి సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు, రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ చేస్తున్నారు.


Full View


Tags:    

Similar News