ఆ గేమ్ నన్ను వ్యంగ్యంగా చూపిస్తోంది: సల్మాన్ ఖాన్

Update: 2021-09-08 07:32 GMT
కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి బాలీవుడ్ చిత్రపరిశ్రమలో తెలియని వారు ఉండరు. హిందీ సినీ మార్కెట్ లో సల్మాన్ అగ్రహీరోల్లో ఒకరు. అభిమానులు ఆయనను ముద్దుగా ‘సల్మాన్ భాయ్’ అని పిలుచుకుంటూ ఉంటారు.

అయితే సల్మాన్ పై కొన్ని సంవత్సరాల క్రితం ‘హిట్ అండ్రన్’ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కాన్సెప్ట్ ఆధారంగా తయారైన వీడియో గేమ్ ‘సెల్మన్ భాయ్’. అది తన పేరు ‘సల్మాన్ భాయ్’ను పోలి ఉందని.. అందులోని చిత్రాలు తనను వ్యంగ్యంగా చూపిస్తున్నాయని.. గేమ్ డెవలపర్స్ పై హీరో సల్మాన్ ఖాన్ ముంబై సివిల్ కోర్టులో గత నెల ఫిర్యాదు చేశాడు.

సల్మాన్ భాయ్ కేసును విచారించిన ముంబై సివిల్ కోర్టు జడ్జి ‘సెల్మాన్ భాయ్’ వీడియో గేమ్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని తాజాగా ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సివిల్ కోర్టు జడ్జి కేఎం జైస్వాల్ సోమవారం జారీ చేశారు. మంగళవారం నుంచి దాని కాపీ అందుబాటులోకి వచ్చింది.

కాగా ఈ గేమ్ సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసుకు పేరడీల ఉందని ప్రాథమిక విచారణలో తేలినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాబట్టి ఆ వీడియో గేమ్ ప్రమోషన్స్, లాంచింగ్, రీ లాంచింగ్ లలో సల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఎటువంటి విషయాలు లేకుండా నిషేధించారు.ఇక ఆ గేమ్ ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి కూడా తొలగించాలని గేమ్ డెవలపర్స్ పేరడీ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ గేమ్ కు సంబంధించి సల్మాన్ ఎటువంటి అనుమతి ఇవ్వలేదని అందులో పేర్కొన్నారు.

‘సెల్మన్ భాయ్’ గేమ్ డెవలపర్స్ నా అనుమతి లేకుండానే కమర్షియల్ గా లబ్ధి పొందారని గతనెల సల్మాన్ ఖాన్ ఫైల్ చేసిన కేసులో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై సెప్టెంబర్ 20లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని గేమ్ డెవలపర్స్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News