బాహుబలి మీద పడి ఏడుస్తున్నాడుగా

Update: 2015-07-16 07:44 GMT
బాహుబలి ఇంటా బైటా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే రూ.200కోట్ల మార్క్‌ను అధిగమించింది. 300కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టబోతోంది. బాలీవుడ్‌లోనూ బాహుబలి ఫీవర్‌ ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదు. సరిగ్గా ఇదే టైమ్‌లో సల్మాన్‌ఖాన్‌ నటించి నిర్మించిన బజరంగి భాయిజాన్‌ రిలీజ్‌కి వస్తోంది. ఈ శుక్రవారమే రిలీజ్‌. అలాగే సల్మాన్‌భాయ్‌ పెట్టుబడులు పెట్టిన 'హీరో' కూడా రిలీజ్‌కి రెడీ అవుతోంది. బాహుబలి సునామీ ముందు ఇవన్నీ నిలుస్తాయా? అన్న చర్చ బాలీవుడ్‌లో సాగుతోంది.

ఇదే ప్రశ్న సల్మాన్‌ ముందు ఉంచితే.. ఓ మాట అన్నాడు. బాహుబలి మంచి సినిమా. ఆ స్థాయిని మన సినిమా అందుకోవాలి. కలెక్షన్లలోనూ ఆ ఫిగర్‌ని అందుకోవాలి. మన దగ్గర ఆ రేంజు కలెక్షన్లు వాళ్ళ సినిమా కాకుండా మన సినిమా అందుకుంటే బాగుంటుంది. అంటూ నాలుక మడత పెట్టేశాడు. అంటే సల్మాన్‌ భాయ్‌ ఉద్ధేశం ఇప్పట్లో వేరే ఏ బాలీవుడ్‌ సినిమా టచ్‌ చేయలేని రేంజులో రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఉందని అర్థం. బాహుబలి రికార్డుల్ని టచ్‌ కూడా చేయలేమనే సందేహం సల్లూ భాయ్‌కి వచ్చిందని ఈ మాటల్ని బట్టి అర్థమవుతోంది. హీరో చిత్రంతో ఆదిత్య పాంచోళీ తనయుడు సూరజ్‌ పాంచోళి, సునీల్‌ శెట్టి గారాల తనయ ఆథియా నాయకానాయికలుగా పరిచయం అవుతున్నారు.

Tags:    

Similar News